Narmada River సాధారణంగా నదులన్నీ తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ ఒక్క నర్మద నది మాత్రమే పశ్చిమ దిశగా ప్రవహించి అరేబియం మహాసముద్రంలో కలుస్తుంది. ఎందుకో తెలుసా?
నర్మద నది మధ్యప్రదేశ్లోని అమర్కాంతాక్ అనే ప్రాంతంలో మొదలవుతుంది. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ మీదుగా ప్రవహించి బరూచ్లోని అరేబియన్ మహాసముద్రంలో కలుస్తుంది. ఈ నది 1,312 కిలోమీటర్ల మేర ప్రవహిస్తుంది.
నర్మదా నది వింధ్య (ఉత్తరం) సత్పురా పర్వతాల (దక్షిణం) మధ్య ఉన్న ఈ లోయలో ప్రవహిస్తుంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం భూమి పొరలు కదలడంతో జరిగిన కదలికల వల్ల ఈ రెండు పర్వతాల మధ్య లోయ ఏర్పడింది.
ఈ ప్రాంతం పశ్చిమ దిశగా కొంచెం వాలుగా మారింది. నీరు ఎప్పుడూ వాలుగా ఉన్న దిశలోనే ప్రవహిస్తుంది కాబట్టి నర్మదా నది తూర్పు కాకుండా పశ్చిమం వైపు ప్రవహిస్తుంది.
తూర్పు దిశగా ప్రవహించే నదుల కంటే పశ్చిమ దిశగా ప్రవాహం వేగంగా ఉంటుంది. లోతూ ఎక్కువే.





