Virat Kohli ఇష్టమైన బ్యాటర్ గ్రౌండ్‌లోకి అడుగుపెడుతున్నాడంటే అభిమానులకు కిక్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ టీమిండియాకి చెందిన ఆటగాళ్లు ఆడుతున్నప్పుడు తమకు నచ్చిన క్రికెటర్‌ని మైదనాంలో చూడాలన్న ఉత్సాహంతో.. అదే టీమ్‌లో ఉన్న మరో క్రికెటర్ అవుట్ అవ్వాలని కోరుకోవడం.. వారి వికెట్లు పడితే చిందులేయడం ఎంత వరకు కరెక్ట్? స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా ఇదే విషయంలో డిజప్పాయింట్ అయ్యారు. జనవరి 11న వడోదరలో భారత్, న్యూజిల్యాండ్ మధ్య తొలి ODI మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. న్యూజిల్యాండ్ అప్పటికే 300 బాదేసింది. ఇక మనం ఛేజ్ చేయాల్సిన పరిస్థితి. అదే సమయంలో రోహిత్ శర్మ అవుట్ అయ్మాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ అడుగుపెట్టాల్సి ఉంది.
అయితే.. టీమిండియా గెలవాలన్న ఉద్దేశం లేకుండా.. రోహిత్ అవుట్ అవ్వగానే తర్వాత కోహ్లీ వస్తాడని అభిమానులంతా ఒక్కసారిగా కేకలు వేసారు. దాంతో రోహిత్ చాలా బాధపడ్డాడు. ఆ తర్వాత కోహ్లీ వచ్చినప్పటికీ అతను కూడా ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఇందుకు కారణం.. టీమిండియాకి సపోర్ట్ చేస్తూ అదే టీమ్‌కి చెందిన స్టార్ క్రికెటర్ అవుట్ అయితే సెలబ్రేట్ చేసుకోవడం. ఇది కోహ్లీకి ఏమాత్రం నచ్చలేదు. అభిమానుల ప్రేమ, ఆప్యాయతలకు తాను ఎప్పటికీ రుణ పడి ఉంటాను కానీ ఇలా ఒకే టీంకి చెందిన ఆటగాడు ఓడిపోవాలని కోరుకోవడం పెద్ద తప్పని అన్నాడు.
ఇది ధోనీ విషయంలో కూడా జరగడం తాను చూసానని.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సమయంలో కేవలం ధోనీని గ్రౌండ్‌లో చూసేందుకు ఆయన ముందు ఆడుతున్న మిగతా బ్యాటర్లు వెంటనే ఓడిపోవాలని కోరుకుంటున్నవాళ్లు చాలా మంది ఉన్నారని.. ఈ ఆలోచనా విధానం మారితే బాగుంటుందని కోహ్లీ తెలిపారు.





