Search The Query
Search

Image
  • Home
  • Spiritual
  • Shani Trayodashi: మ‌హాద్భుత‌మైన రోజు.. ఈ ప‌ని చేయండి చాలు

Shani Trayodashi: మ‌హాద్భుత‌మైన రోజు.. ఈ ప‌ని చేయండి చాలు

Shani Trayodashi: 2025 సంవ‌త్స‌రంలో రేపే (11 జ‌న‌వ‌రి) శ‌ని త్ర‌యోద‌శి రానుంది. ఈ శ‌ని త్ర‌యోద‌శి మ‌హాద్భుత‌మైన‌ది. ఎందుకంటే.. విష్ణుమూర్తికి ఎంతో విశేష‌మైన ధ‌నుర్మాసంలో వ‌చ్చింది కాబ‌ట్టి. మ‌రి ఈ శ‌ని త్ర‌యోద‌శి రోజున ఏ రాశుల వారికి మంచి జ‌ర‌గ‌బోతోంది… పాటించాల్సిన నియ‌మాలు ఏంటి.. వంటి విష‌యాల‌ను తెలుసుకుందాం.

ఈ శ‌ని త్ర‌యోద‌శి ప్ర‌తి సంవ‌త్స‌రంలో మూడు నాలుగు సార్లు వ‌స్తుంటుంది. కానీ ధ‌నుర్మాసంలో వ‌చ్చే శ‌ని త్రయోద‌శి చాలా ప్ర‌త్యేక‌మైన‌ది.. ప్ర‌భావ‌వంత‌మైన‌ది. ఎందుకంటే.. విష్ణుమూర్తి కోస‌మే ఉన్న ఈ ధ‌నుర్మాసంలో.. విష్ణుమూర్తి తోడ‌ల్లుడైన శ‌ని త్ర‌యోద‌శికి చాలా ప్ర‌త్యేక‌త ఉంటుంది. ఎందుకు ఈ శ‌ని త్ర‌యోద‌శి అంత ప్రాముఖ్య‌త సంత‌రించుకుంది అంటే.. మ‌నం గ‌మ‌నిస్తే.. మార్చి 29న శ‌ని కుంభ రాశి నుంచి మీన రాశిలోకి వెళ్తారు. అప్పుడు ఏమ‌వుతుందంటే.. మ‌క‌ర రాశి వారికి శ‌ని దోషం పోతుంది. వృశ్చిక రాశి వారికి అర్ధాష్ట‌మ శ‌ని.. క‌ర్కాట‌క రాశి వారికి అష్ట‌మ శ‌ని.. వృష‌భ రాశి వారికి కంఠ‌క శ‌ని తొల‌గిపోతాయి. (Shani Trayodashi)

కొత్త‌గా మార్చి 29 నుంచి మేష వారికి ఏలినాటి శ‌ని.. ధ‌నుస్సు రాశి వారికి అర్ధాష్ట‌మ శ‌ని.. సింహ రాశి వారికి అష్ట‌మ శ‌ని ప్రారంభం అవుతాయి. కానీ వీల్లంద‌రూ కూడా సంతోష‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. శ‌ని దోషం పోయింద‌ని సంతోష ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.. కొత్త‌గా శ‌ని దోషం ప్రారంభమైన‌వారు భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. జులై 8న మీన రాశిలో శ‌ని భ‌గ‌వానుడు మ‌ళ్లీ వ‌క్రీక‌రిస్తున్నాడు. అప్పుడు వెన‌క‌టి రాశి ఫ‌లితాల‌నే ఇస్తాడు.  ఇక్క‌డ పాయింట్ ఏంటంటే.. 2025 సంవ‌త్స‌రంలో 12 రాశుల వారు శ‌ని ప్ర‌భావానికి గుర‌వుతారు. కాబ‌ట్టి అంద‌రూ శ‌ని దోష నివార‌ణ‌లు చేయించుకోవాల్సిందే.

అలాగ‌ని శ‌ని భ‌గ‌వానుడు అన్ని రాశుల వారికి క‌ష్టాలే ఇస్తాడా అనుకుంటే అది పొర‌పాటే. ఉదాహ‌ర‌ణ‌కు .. అల‌నాటి దివంగ‌త న‌టుడు ఎన్టీరామారావు ఏలినాటి శ‌ని ప్ర‌భావం ఉన్నప్పుడే తెలుగు దేశం పార్టీని పెట్టి 9 నెల‌ల్లోనే ముఖ్య‌మంత్రి పీఠాన్ని పొందారు అని చెప్తుంటారు. అది సాదాసీదా రాజ‌యోగం కాదు. భార‌త‌దేశాన్ని గ్రిప్‌లో పెట్టుకున్నార‌ట ఆయ‌న‌. అంటే.. ఇక్క‌డ విష‌యం ఏంటంటే.. అంత‌టి శ‌ని ఇస్తే ఫ‌లితాల‌ను అద్భుతంగా ఇస్తాడు. లేక‌పోతే చాలా క‌ష్టాలు పెడ‌తాడు. ఇక్క‌డ క‌ష్టాలు పెడుతున్నాడ‌ని చెప్పి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే.. గ‌త జ‌న్మ క‌ర్మ దోషాల‌న్నీ క‌ష్టాల రూపంలో తొల‌గింప‌జేస్తాడు. ఇది ఇక్క‌డ మ‌నం గ‌మ‌నించాల్సిన అంశం. అంతేకాదు.. చాలా మందికి తెలీని విష‌యం ఏంటంటే.. 2024లో పెళ్లిళ్లు కాక ఇబ్బందులు ప‌డుతున్న‌వారు ఇల్లు క‌ట్టుకున్న కోరిక తీర‌లేని వారు.. శ‌ని ప్ర‌భావం వ‌ల్ల తీర్చుకోగ‌లుగుతారు.

ఎందుకంటే రుణానుబంధు రూపేణ ప‌శుప‌త్ని సుతాల‌యః రుణం ఉంటేనే భార్య‌, భ‌ర్త‌, పిల్ల‌లు, సంప‌ద ఇవ‌న్నీ పూర్వ జ‌న్మ రుణం ఉంటేనే క‌లుగుతాయి. పూర్వ‌కాలంలో భ‌ర్త మాత్ర‌మే సంపాదించేవాడు. ఈరోజుల్లో ఆడ‌వాళ్లు కూడా భ‌ర్తా పిల్ల‌ల్ని పోషిస్తున్నారు. కాబ‌ట్టి.. ఈ శ‌ని ప్ర‌భావం ధ‌నుర్మాసంలో వ‌స్తున్న శ‌ని త్ర‌యోద‌శి కాబ‌ట్టి అద్భుత‌మైన రోజుని అంద‌రూ శ‌ని దోష పరిహారం చేసుకుంటే మంచి జ‌రుగుతుంది. ఇంట్లో ఉండే పైసా ఖ‌ర్చు లేకుండా అతి సామాన్యుడు కూడా చేసుకోగ‌లిగే ప‌రిహారాలు ఉన్నాయి. అవేంటంటే.. (Shani Trayodashi)

11న శ‌నివారం ఉద‌యం 8:22 వ‌ర‌కు ద్వాద‌శి తిథి ఉంటుంది. కాబ‌ట్టి.. ఆ త‌ర్వాత త్ర‌యోద‌శి తిథి వ‌స్తుంది కాబ‌ట్టి.. 8:30 క‌ల్లా కాల‌కృత్యాలు తీర్చుకుని ద‌గ్గ‌ర్లోని శివాల‌యం, న‌వ‌గ్ర‌హాలు, రావిచెట్టు ఉన్న శివాల‌యానికి వెళ్లాలి. మొట్ట మొద‌టిగా.. మీనం, మేషం, క‌ర్కాట‌కం, సింహం, వృశ్చికం, ధ‌నుస్సు రాశుల్లో జ‌న్మించిన‌వారు రావిచెట్టు చుట్టూ నారాయ‌ణాయ న‌మః అంటూ 27 ప్ర‌ద‌క్షిణ‌లు చేసి తూర్పు వైపు నిల‌బ‌డి విష్ణు అష్టోత్త‌రం మూడు సార్లు పారాయ‌ణం చేసి చెంబు నీళ్లు రావి చెట్టులో పోసి.. ఆ త‌ర్వాత న‌వ‌గ్ర‌హాల వ‌ద్ద శివాయ న‌మః అంటూ 27 ప్ర‌ద‌క్షిణ‌లు చేయాలి. ఆ త‌ర్వాత శ‌నీశ్వ‌రుడికి న‌ల్ల నువ్వుల నూనెతో అభిషేకం, దీపారాధ‌న‌, 8 న‌ల్ల నువ్వుల ల‌డ్డూలు నైవేద్యంగా పెట్టి వెన‌క్కి తిరిగి చూడ‌కుండా ఇంటికి వెళ్లిపోవాలి.

వృష‌భం, మిథునం, క‌న్యా, తుల, మ‌క‌రం, కుంభ రాశుల వారు రావి చెట్టు చుట్టూ శివాయ‌న‌మః అంటూ 27 ప్ర‌ద‌క్షిణ‌లు చేసి న‌వ‌గ్ర‌హాల ద‌గ్గ‌ర శివాయ‌న‌మః అంటూ 27 ప్ర‌ద‌క్షిణ‌లు చేసి శ‌నీశ్వ‌రుడికి నూనెతో అభిషేకం, దీపారాధ‌న‌, ల‌డ్లు నైవేద్యం పెట్టి వెనక్కి తిరిగి చూడ‌కుండా వెళ్లిపోవాలి. వీలైతే ఆ రోజున ఉప‌వాసం ఉంటే ఎంతో మంచిది. ఒక‌వేళ భోజ‌నం చేయాల‌నుకునేవారు సాయంత్రం 4 గంట‌ల క‌ల్లా అరిగిపోయేలా చూసుకోవాలి. అంటే మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కే భోజ‌నాన్ని ముగించేయాలి. మ‌ధ్యాహ్నం 1:18 గంట‌ల నుంచి 2:18 గంట‌ల మ‌ధ్య‌లో శ‌నిహోరం ఉంటుంది. అప్పుడు మాన‌సిక విక‌లాంగుల‌కు, పారిశుద్ధ్య కార్మికుల‌కు, శారీర‌క విక‌లాంగుల‌కు, వృద్ధాశ్ర‌మాల్లో ఉన్న‌వారికి అవ‌స‌ర‌మైన‌వి దానం చేస్తే ఎంతో మంచిది. వారికి ఏం అవ‌స‌ర‌మో అవి ఇస్తే ఎంతో మంచిది. ఇదే శ‌నిహోరం స‌మ‌యంలో కాల‌భైర‌వాష్ట‌కం, హ‌నుమాన్ చాలీసా చ‌దివితే ఇక ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అని చెప్ప‌వ‌చ్చు.  (Shani Trayodashi)

More News

Newmoon amidst dark clouds
2026 November Amavasya: ఈ రాశుల వారు జాగ్ర‌త్త‌
BySai KrishnaNov 18, 2025

2026 November Amavasya: ఈ నెల (న‌వంబ‌ర్ 2026) 20న అమావాస్య‌. ఈసారి ప్రత్యేక గ్రహ స్థితులతో అమావాస్య‌ రావడంతో…

Temple
temples to visit based on birthdate: పుట్టిన తేదీని బ‌ట్టి ద‌ర్శించుకోవాల్సిన ఆల‌యాలు
BySai KrishnaNov 18, 2025

temples to visit based on birthdate: మ‌నం సాధార‌ణంగా ప్ర‌తి పుట్టిన‌రోజుకి ఏదో ఒక ఆల‌యానికి వెళ్తుంటాం. ఇది…

Indian Marriage Rituals
2026 marriage astrology: 2026లో పెళ్లి యోగం ఉన్న రాశులివే
BySai KrishnaNov 18, 2025

2026 marriage astrology: 2026 సంవత్సరం కొన్ని రాశుల వారికి పెద్ద మార్పులు తీసుకురానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కొన్ని…

beautiful scene recorded in a nellore temple on Nagula Chavithi
Nagula Chavithi: నెల్లూరులో అద్భుతం
BySai KrishnaOct 25, 2025

Nagula Chavithi: ఈరోజు నాగుల చ‌వితిని పుర‌స్క‌రించుకుని తెలుగు రాష్ట్రాలకు చెందిన భక్తులు సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి, శివాల‌యాల‌కు పోటెత్తుతున్నారు. ఈ నేప‌థ్యంలో…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top