Rishabh Pant News: కెప్టెన్సీకి నో చెప్పిన పంత్

Rishabh Pant News: రంజీ ట్రోఫీకి సంబంధించిన రెండో రౌండ్ జ‌న‌వ‌రి 23 నుంచి మొద‌లు కాబోతోంది. గుజ‌రాత్‌లోని రాజ్‌కోట్‌లో జ‌ర‌గ‌నున్న మ్యాచ్‌లో సౌరాష్ట్రా టీంపై రిష‌భ్ పంత్ ఢిల్లీ టీం త‌ర‌ఫున ఆడ‌నున్నాడు. అయితే రంజీ ట్రోఫీలో కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోవ‌డానికి పంత్ సిద్ధంగా లేడ‌ట‌. ఈ విష‌యాన్ని అత‌నే స్వ‌యంగా వెల్ల‌డించాడు. 2018 త‌ర్వాత పంత్ ఆడ‌బోయే తొలి రంజీ ట్రోఫీ ఇది. ఈ నేప‌థ్యంలో ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ పంత్‌ను కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని కోర‌గా.. ఇందుకు పంత్ ఒప్పుకోలేదు. ఆ ఆఫ‌ర్‌ను తిర‌స్క‌రించింది. రెగ్యుల‌ర్‌గా టీంతో ఆడ‌టం లేదు కాబ‌ట్టి ఇప్పుడు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించ‌డం స‌రికాద‌ని చెప్పాడ‌ట. తాను గ‌న‌క కెప్టెన్‌గా ఉంటే టీంలో బ్యాలెన్స్ డిస్ట‌ర్బ్ అవుతుంద‌ని అన్నాడ‌ట‌.  ప్ర‌స్తుతం రంజీ టీమ్స్‌కి ఉన్న మెంటార్‌షిప్ చాలా విలువైన‌ద‌ని.. త‌న కెప్టెన్సీ అవ‌స‌రం లేద‌ని త‌న అభిప్రాయాన్ని ఢిల్లీ క్రికెట్ అసోసియేష‌న్ ముందు పెట్టాడు. 2025 ఛాంపియ‌న్స్ ట్రోఫీ ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో పంత్ రంజీ మ్యాచ్‌ల‌న్నింటిలో ఆడే అవ‌కాశం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *