BR Naidu: ప‌వ‌న్ సారీ చెప్ప‌మంటే చెప్పాలా?

BR Naidu: వైకుంఠ ఏకాద‌శి నాడు శ్రీవారిని ద‌ర్శించుకోవాల‌ని.. టికెట్ల కోసం తిరుప‌తికి వ‌చ్చిన భ‌క్తుల్లో ఏడుగురు వ్య‌క్తులు మొన్న జ‌రిగిన తొక్కిస‌లాట‌లో మృతిచెందిన సంగ‌తి తెలిసిందే. దీనిపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ఈ పాపం ఎవ‌రిది అంటే ఫ‌లానా వ్య‌క్తిది అని వేలు చూపి నిందించ‌లేం. కానీ తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానంకి సంబంధించిన ప్ర‌తి ఒక్క అధికారి ఈ విష‌యంలో బాధ్య‌త తీసుకోవాలి. మ‌రీ ముఖ్యంగా తితిదే ఛైర్మ‌న్ బీఆర్ నాయుడు. ఈవో శ్యామ‌లా రావు, ఏఈవో వెంక‌య్య చౌద‌రి, పాల‌క మండ‌లి అధికారులు.. వీరంతా కూడా ఈ విష‌యంలో బాధ్య‌త తీసుకోవాల్సిందే.

ప్ర‌భుత్వం ఆల్రెడీ చ‌నిపోయిన బాధితుల కుటుంబాల‌కు రూ.25 ల‌క్ష‌ల మేర న‌ష్ట ప‌రిహారం ప్ర‌క‌టించింది. కానీ అది ప్ర‌భుత్వం త‌ర‌ఫున అందాల్సిన ప‌రిహారం. మ‌రి బీఆర్ నాయుడు, శ్యామ‌లా రావులు ఏమీ ఇవ్వ‌రా? ఆదుకోవాల్సిన బాధ్య‌త వారికి లేదా? పైగా ఈరోజు బీఆర్ నాయుడు చేసిన వ్యాఖ్య‌లు జ‌న‌సేన నాయకుల్లో ఆగ్ర‌హం తెప్పించే విధంగా ఉన్నాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈరోజు ఓ ప్ర‌సంగంలో మాట్లాడుతూ.. తొక్కిస‌లాట‌లో గాయాల‌పాలైన వారిని ప‌రామ‌ర్శించ‌డానికి వెళ్తే.. దేవుడే మ‌మ్మ‌ల్ని బ‌య‌టికి లాక్కొచ్చాడ‌య్యా.. ఏం చేస్తాం మా ఖ‌ర్మ అని వారు అంటుంటే త‌న క‌ళ్ల‌ల్లో నీళ్లు తిరిగాయ‌ని.. ఇలాంటి ప్ర‌జ‌ల‌కు క‌దా మ‌నం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సింది అని అన్నారు. తితిదేకి చెందిన ప్ర‌తి ఒక్క అధికారి బాధితుల‌కు మీడియా ముఖంగా క్ష‌మాప‌ణ‌లు చెప్పి తీరాల‌ని పిలుపునిచ్చారు. (BR Naidu)

ప‌వ‌న్ చెప్తే నేను చేయాలా?

BR Naidu: ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌మ‌న్నారు క‌దా.. మ‌రి మీరు చెప్తారా స‌ర్ అని మీడియా వ‌ర్గాలు బీఆర్ నాయుడుని ప్ర‌శ్నించ‌గా.. క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డంలో త‌ప్పు లేదు. కానీ నేను క్ష‌మాప‌ణ‌లు చెప్పినంత మాత్రాన పోయిన ప్రాణాలు తిరిగి రావు క‌దా. ఎవ‌రో ఏదో అన్నార‌ని ప్ర‌తి దానికి స్పందించాల్సిన అవ‌స‌రం లేదు. కానీ ఈ ఘ‌ట‌న విష‌యంలో త‌ప్పు ఎవ‌రిది ఉన్నా త‌ప్ప‌కుండా క‌ఠిన చర్య‌లు తీసుకుంటాం అని అన్నారు.  ఇదేం పొగ‌రు? ప‌వ‌న్ త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడైన‌ప్ప‌టికీ ఆయ‌న రాష్ట్రానికి ఉప ముఖ్య‌మంత్రి.

అస‌లు ప‌వ‌న్ చెప్పిన దాంట్లో త‌ప్పేముంది? త‌ప్పు జ‌రిగింది… భ‌క్తుల ప్రాణాలు పోయాయి. క‌నీసం క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిన బాధ్య‌త లేదా అని అన్నారు. అందులో త‌ప్పేముంది? ఎందుకు బీఆర్ నాయుడుకి అంత పొగ‌రు? ప‌వ‌న్ త‌న‌కంటే వ‌య‌సులో చిన్న‌వాడ‌నా? లేక‌పోతే చంద్ర‌బాబు నాయుడు కాకుండా పవ‌న్ త‌న‌ను సారీ చెప్ప‌మ‌ని అడ‌గ‌మేంటి అని అహంకార‌మా? అస‌లు ప‌వ‌న్ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌మ‌ని కోరేంత‌వ‌ర‌కు ఎవ్వ‌రూ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్తున్న‌ట్లు ఒక్క ప్రెస్‌మీట్ రిలీజ్ చేసింది లేదు. క‌నీసం ఇప్ప‌టికైనా క్ష‌మాప‌ణ‌లు చెప్పాల్సిందిపోయి ఎవ‌రో ఏదో అంటే స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం లేదు అని బీఆర్ నాయుడు అన‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్ట్? ఒక ఉప ముఖ్య‌మంత్రికి ఆయ‌న ఇచ్చే గౌర‌వం ఇదేనా? అంటూ జ‌న‌సేన అభిమానులు మండిప‌డుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *