Naga Chaitanya Sobhita Wedding ఐదు రోజుల పెళ్లి గురించి విన్నాం. ఒకప్పుడు ఐదు రోజల పాటు ఎంతో ఆడంబరంగా వివాహాలు జరిపించేవారు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మారుతున్న జీవన శైలికి తగ్గట్టు ఉన్నంతలో గ్రాండ్‌గా వివాహాలు చేసుకుంటున్నారు. అయితే.. డిసెంబర్ 4న యువ సామ్రాట్ నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ్ల వివాహ బంధంతో ఒకటి కానున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి సంబంధించి సన్నిహితులు కీలక విషయాలను పంచుకున్నారు.
పెళ్లి ఎక్కడ?
నాగచైతన్య, శోభితల వివాహానికి రాజస్థాన్‌లోని ఓ ప్యాలెస్‌ని ఎంపిక చేసుకున్నారని.. అతిథుల కోసం స్టార్ హోటల్స్ బుకింగ్ చేసేసారని అన్నారు. కానీ అలాంటి ఆడంబరాలకు పోకుండా మాకు సింపుల్‌గా పెళ్లి చేసుకోవాలని ఉంది అని వారిద్దరూ అక్కినేని నాగార్జునతో అన్నారట. పెళ్లి గ్రాండ్‌గా జరగకపోయినా సంప్రదాయంగా జరిగితే అంతే చాలు అని చెప్పారు.
దాంతో లంకంత ఇల్లు.. అన్నపూర్ణ స్టూడియోస్ వంటి స్థలాలు ఉండగా ఇక ప్యాలెస్‌లు ఎందుకు అని ఆలోచించిన నాగార్జున.. అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే వివాహ వేడుకను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన అలనాటి నటుడు అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందు ఈ లవ్ బర్డ్స్ వివాహ బంధంతో ఒకటి కానున్నారు. నాగచైతన్య మొదటి వివాహం తెలుగు, క్రైస్తవ సంప్రదాయాల్లో జరిగింది. ఈ రెండు వేడుకలను గోవాలో నిర్వహించారు. దాంతో డెస్టినేషన్ వెడ్డింగ్ అచ్చి రాలేదేమో అని నాగచైతన్య ఆలోచించి ఇంట్లోనే చేసుకుంటే మంచిది అని తన తండ్రికి చెప్పినట్లు తెలుస్తోంది.

డిసెంబర్ 4 చాలా స్పెషల్
Naga Chaitanya Sobhita Wedding ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఎన్నో మంచి ముహూర్త తేదీలు ఉన్నాయి. కానీ నాగచైతన్య పట్టుబట్టి డిసెంబర్ 4న మంచి ముహూర్తం కుదిరేటట్టు పంతులు గారితో మాట్లాడుకున్నారట. ఎందుకంటే డిసెంబర్ 4 నాగచైతన్యకు ఎంతో ప్రత్యేకం. తన తండ్రి నాగార్జున.. తల్లి లక్ష్మీల వివాహం డిసెంబర్ 4నే జరిగింది. వీరిద్దరికీ పుట్టిన వాడే నాగచైతన్య అని మనకు తెలిసిన విషయమే. ఆ తర్వాత పలు వ్యక్తిగత కారణాల వల్ల నాగార్జున, లక్ష్మీ విడిపోయారనుకోండి..! ఎంత విడిపోయినా వారిద్దరూ తన తల్లిదండ్రులే కదా. అందుకే వారి వివాహ తేదీనే తన వివాహం కూడా జరగాలన్న ఉద్దేశంతో డిసెంబర్ 4న తన వివాహాన్ని ఖాయం చేసుకున్నాడు.
8 గంటల వివాహం
నాగచైతన్య, శోభితల వివాహం 8 గంటల పాటు జరగనుందట. తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన శోభిత ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారట. తూతూ మంత్రంలా సాధారణ పెళ్లిళ్లలా కాకుండా పాతకాలంలో జరిగిన విధంగా తమ పెళ్లి జరగాలని చెప్పారట. ఇందుకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి. పెళ్లి కోసం శోభిత కాంజీవరం సిల్క్ చీర బంగారు జరీతో డిజైన్ చేసిన చీరను ధరించబోతున్నారు. ఇందుకోసం శోభిత తన తల్లితో కలిసి ఇటీవల షాపింగ్ కూడా చేసారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని పొందూరు ప్రాంతంలో ప్రత్యేకంగా నేసిన తెల్ల ఖాదీ చీరను కూడా డిజైన్ చేయించుకున్నారు. నాగచైతన్యకు కూడా ఓ మ్యాచింగ్ సెట్ తీసుకున్నారట. తన పెళ్లి గురించి మరో నాలుగు తరాలు మాట్లాడుకునేంతలా శోభిత ప్రతీ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ దగ్గరుండి చూసుకుంటోందట.

వైరల్‌గా మారిన శుభలేఖ
ఇక ఇరు కుటుంబాల నుంచి ప్రత్యేకమైన డిజైన్లతో తయారుచేయించిన శుభలేఖలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కేవలం ఒక కార్డు ఇచ్చి సరిపెట్టకుండా తెలుగుదనం ఉట్టిపడేలా ఒక వస్త్రం, కోలాటం కర్రలు, ఫుడ్ ప్యాకెట్స్ పంపారు. శుభలేఖలో ఆలయాలు, గంటలు, అరటి చెట్లు, గోమాత కనిపించేలా చక్కగా డిజైన్ చేసారు.