Akhil Akkineni Zainab Ravdjee ఎట్టకేలకు అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడు కాబోతున్నాడు. జైనాబ్ రవిద్జీ అనే యువతితో అఖిల్ నిశ్చితార్థం ఈరోజు ఘనంగా జరిగింది. ఈ నేపథ్యంలో అఖిల్ తనకు కాబోయే భార్యను పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో చూడముచ్చటైన ఫోటోలు పోస్ట్ చేసారు.
ఎవరీ జైనాబ్?
జైనాబ్ ప్రముఖ వ్యాపారవేత్త అయిన జుల్ఫీ రవిద్జీ కూతురు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో జుల్ఫీ ప్రభుత్వ సలహాదారుగా పనిచేసారు. ఈయన జగన్‌కి నాగార్జునకు మంచి మిత్రుడు. అయితే.. అఖిల్ కంటే జైనాబ్ దాదాపు 11 ఏళ్లు పెద్దది. ఇప్పుడు జైనాబ్ వయసు 39. ఈమె పెయింటర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. జైనాబ్‌కు వన్స్ ఆపాన్ ది స్కిన్ అనే స్కిన్ కేర్ బ్రాండ్ కూడా ఉంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 50 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కాకపోతే ఆమె ఇన్స్టాగ్రామ్ ఖాతాను ప్రైవేట్‌లో పెట్టుకున్నారు. కనీసం డిస్ప్లే పిక్చర్ కూడా పెట్టలేదు. దీనిని బట్టి చూస్తే ఆమె చాలా ప్రైవేట్ పర్సన్ అని తెలుస్తోంది.

జైనాబ్ తండ్రి జుల్ఫీ నాగార్జునకు మంచి మిత్రుడు కావడంతో ఇరు కుటుంబాలకు మంచి అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలో అఖిల్ జైనాబ్ కొంతకాలంగా డేటింగ్లో ఉన్నారు. మొత్తానికి నాగార్జున ఇద్దరు కుమారులు 2025 నాటికి ఓ ఇంటి వారు కాబోతున్నారు. మరోపక్క నాగచైతన్య, శోభిత ధూళిపాళ్లల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరగనుంది.
2016లో అఖిల్.. ప్రముఖ వ్యాపారవేత్త GVK రెడ్డి మనవరాలైన శ్రియా భూపాల్‌ని ప్రేమించాడు. ఇరు కుటుంబీకులు ఒప్పుకోవడంతో 2016 డిసెంబర్లో వీరి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. అయితే నిశ్చితార్థం అయిన కొన్ని నెలల్లోనే అఖిల్, శ్రియల మధ్య మనస్పర్థలు రావడంతో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత శ్రియ వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగిందని ఆ గొడవ కారణంగానే ఇద్దరూ విడిపోయారని కొంతకాలం పాటు టాక్ నడిచింది. ఏదేమైనప్పటికీ నాగార్జున ఇద్దరు కొడుకులు ఓ ఇంటివారు కాబోతున్నారు. అక్కినేని కుటుంబంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి.
Akhil Akkineni Zainab Ravdjee అయితే.. వీరి పెళ్లి తేదీని మాత్రం నాగార్జున ఇంకా ప్రకటించలేదు. ముందు నాగచైతన్య శోభిత వివాహం అయిపోయాక ఆ తర్వాత అఖిల్ వివాహం గురించి చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. నాగచైతన్య, శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనుంది. అఖిల్ వివాహం కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిపిస్తారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది.
ఇక అఖిల్ సినిమాల విషయానికొస్తే ఆయన చివరిగా నటించిన ఏజెంట్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దాంతో ఈసారి మాత్రం ఏదన్నా మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రావాలన్న దృఢ సంకల్పంతో అఖిల్ ఉన్నాడు. అందుకే కాస్త లేట్ అయినా మంచి హిట్‌తో రావాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఎన్నో కథలు విన్న అఖిల్ ఇంకా తన తదుపరి సినిమా గురించి డిసైడ్ అవ్వలేదు.