Search The Query
Search

Image
  • Home
  • Sports
  • Rohit Sharma: రోహిత్‌ని త‌ప్పించేసామ‌ని ఒప్పుకోవ‌డానికేంటి నొప్పి?

Rohit Sharma: రోహిత్‌ని త‌ప్పించేసామ‌ని ఒప్పుకోవ‌డానికేంటి నొప్పి?

Rohit Sharma: ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో జ‌రుగుతున్న బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో (Border Gavaskar Trophy) ఈరోజు సిడ్నీలో జ‌ర‌గ‌నున్న చివ‌రి సిరీస్ నుంచి కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌ను త‌ప్పించేసారు. రోహిత్‌కి రెస్ట్ ఇస్తున్నామ‌ని.. దాంతో అత‌నే డ్రాప్ అయ్యాడ‌ని జ‌స్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) వెల్ల‌డించాడు. అత‌ని నిర్ణ‌యాన్ని కోచ్ గౌత‌మ్ గంభీర్‌తో పాటు టీంలోని ఇత‌ర ఆట‌గాళ్లు కూడా గౌర‌వించార‌ని అన్నారు. కానీ రోహిత్ త‌నంత‌ట త‌నే డ్రాప్ అవ్వ‌లేద‌ని.. అత‌ను ఆడిన మూడు సిరీస్‌ల‌లో పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న ఇవ్వ‌డంతో గౌత‌మ్ గంభీరే త‌ప్పించాడ‌ని అంద‌రికీ తెలుసు. అందుకే రోహిత్ ఫ్యాన్స్ గంభీర్‌పై మండిప‌డుతున్నారు. ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్న గంభీర్ త‌మ దృష్టిలో చ‌నిపోయిన‌ట్లే అంటూ ట్విట‌ర్‌లో దారుణ‌మైన హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేసారు.  గంభీర్‌పై ప్రెష‌ర్ ప‌డ‌కుండా ఉండేందుకు బుమ్రా ఇప్పుడు మీడియా ముందుకు వ‌చ్చి రోహితే త‌న‌తంట తాను రెస్ట్ కావాల‌ని అడ‌గ‌డంతో గంభీర్ ఇందుకు ఒప్పుకున్నాడని చెప్తున్న‌ట్లు క్లియ‌ర్‌గా తెలుస్తోంది.

మాజీ కెప్టెన్ ఆగ్ర‌హం

ఈ విష‌యంపై మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ మార్క్ టేల‌ర్ (Mark Taylor) కూడా స్పందించారు. రోహిత్ ప్ర‌ద‌ర్శ‌న బాలేద‌ని తానే తీసేసిన‌ట్లు గంభీర్ ఎందుకు ఒప్పుకోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు. ఆట‌లో స‌రిగ్గా రాణించ‌లేన‌ప్పుడు కొన్ని కఠిన నిర్ణ‌యాలు అంద‌రూ తీసుకుంటార‌ని.. ఇప్పుడు రోహిత్ విష‌యంలో గంభీర్ చేసింది కూడా అదే అయిన‌ప్పుడు నిర్భ‌యంగా ఆ విష‌యాన్ని ఒప్పుకోవ‌డానికి స‌మ‌స్యేంట‌ని ప్ర‌శ్నించారు. ఉన్న‌ది ఉన్నట్లుగా చెప్ప‌కుండా రోహితే డ్రాప్ అయ్యాడ‌ని ఎందుకు అబద్ధాలు ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు.  “” రోహిత్ శ‌ర్మ టీమిండియా కెప్టెన్. ఆస్ట్రేలియాలో బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ జ‌రుగుతుంటే.. అంత ముఖ్య‌మైన మ్యాచ్‌లోని చివ‌రి సిరీస్ వ‌దిలేసుకుని డ్రాప్ అయిపోయాడంటే మేం న‌మ్మాలా? అత‌ని పెర్ఫామెన్స్ బాలేద‌ని త‌ప్పించేసాం అని ఒప్పుకోవ‌డానికి నొప్పేంటి? ఫ్యాన్స్ టార్గెట్ చేస్తార‌ని భ‌య‌ప‌డుతున్నారా? “” అంటూ చుర‌క‌లంటించాడు. (Rohit Sharma)

రోహిత్‌కి ఏమైంది?

ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ఆట తీరును మెరుగుప‌రుచుకుంటూ త‌న సేన‌ను ముందుండి నడిపే రోహిత్‌కి ఏమైంది? అనే ప్ర‌శ్న‌లు త‌లెత్తుతున్నాయి. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో ఇప్ప‌టివ‌ర‌కు జ‌రిగిన నాలుగు సిరీస్‌ల‌లో రోహిత్ ప్ర‌ద‌ర్శ‌న షాకింగ్‌గా ఉంది. రోహిత్ మూడు సిరీస్‌ల‌లో ఆడ‌గా… ఆ మూడింట్లో క‌లిపి కేవ‌లం 31 ప‌రుగులు తీసాడు. మొద‌టి సిరీస్‌లో రోహిత్ ఆడ‌లేదు. త‌నకు మ‌గ‌బిడ్డ పుట్ట‌డంతో కొంత‌కాలం పాటు కుటుంబంతో గ‌డపాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. దాంతో ఇక చివ‌రి సిరీస్ శుక్ర‌వారం జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో గంభీర్ రోహిత్‌ను ప‌క్క‌న పెట్ట‌డం బెట‌ర్ అనుకున్నాడు. ఎందుకంటే బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీ మ‌న సొంతం కావాలంటే శుక్ర‌వారం జ‌రిగే సిరీస్‌లో మ‌నోళ్లు గెల‌వాల్సిందే. అందుకే గంభీర్ ఎవ‌రెన్ని తిట్టుకుంటున్నా అవ‌మానిస్తున్నా త‌న నిర్ణ‌యాన్ని మాత్రం మార్చుకోలేదు. రోహిత్ స్థానంలో శుభ్‌మ‌న్ గిల్ ఆడే అవ‌కాశం ఉంది.  కేఎల్ రాహుల్, య‌శ‌స్వి జైస్వాల్ రేపు ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేయ‌నున్నారు. ఈ ట్రోఫీలో గెలిస్తేనే వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్‌లో టీమిండియా ఆడుతుందో లేదో తేలిపోతుంది. ఇక్క‌డ గంభీర్ టీమిండియా ట్రోఫీ గెల‌వాల‌న్న ఉద్దేశంతో రోహిత్‌కి రెస్ట్ ఇచ్చాడు. అంతేకానీ రోహిత్‌పై ద్వేషంతో కాదు. ఈ విష‌యాన్ని అర్థం చేసుకోకుండా రోహిత్ అభిమానులు ఇలాంటి త‌ప్పుడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టి త‌ప్పుడు కామెంట్స్ చేయ‌డం ఎంత వ‌ర‌కు క‌రెక్టో వారే ఆలోచించుకోవాలి. (Rohit Sharma)

More News

Vaibhav Suryavanshi showing his bat
Vaibhav Suryavanshi: వాగుతూనే ఉన్నాడు.. నా బ్యాట్‌తో స‌మాధానం ఇచ్చా
BySai KrishnaDec 12, 2025

Vaibhav Suryavanshi: ఈరోజు UAEతో జ‌రిగిన U19 ఆసియా క‌ప్ మ్యాచ్‌లో 14 ఏళ్ల యువ‌ క్రికెట‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీకి…

Lionel Messi still
Lionel Messi: షేక్ హ్యాండ్‌కి 10 ల‌క్ష‌లు
BySai KrishnaDec 12, 2025

Lionel Messi: ప్ర‌ముఖ అర్జెంటినా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియెనెల్ మెస్సీ GOAT టూర్‌లో భాగంగా భార‌త‌దేశం రాబోతున్నారు. ఆయ‌న్ను చూసేందుకు…

Gautam Gambhir smiling
Gautam Gambhir pitch controversy: అడిగి మ‌రీ త‌న్నించుకున్నారు
BySai KrishnaNov 16, 2025

Gautam Gambhir pitch controversy: ఈరోజు వెస్ట్ బెంగాల్‌లోని ఈడెన్ గార్డెన్స్‌లో ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భార‌త్…

RCB not going to play in chinnaswamy stadium
RCB ఫ్యాన్స్‌కి షాక్‌.. అక్క‌డ మ్యాచ్ లేన‌ట్లే
BySai KrishnaNov 12, 2025

RCB: రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఫ్యాన్స్‌కి ఇది షాకింగ్ విష‌య‌మ‌నే చెప్పాలి. బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి స్టేడియంలో ఇక RCB IPL…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top