Nani Paradise: ఓ ల*** కొడుకు కథ అంటూ నేచురల్ స్టార్ నాని ప్యారడైజ్ సినిమాతో శివాలెత్తించారు. దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో నాని చేస్తున్న రెండో సినిమా ఇది. ఇటీవల టీజర్ రిలీజ్ అయ్యింది. టీజర్‌లోని ఓ డైలాగ్ టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారిపోయింది. అసలు నాని సినిమా నుంచి ఇలాంటి డైలాగ్‌ని ఎవ్వరూ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. కంటెంట్ లేకుండా నాని కూడా ఇలాంటి రిస్క్‌లు తీసుకోడని ఫ్యాన్స్‌కి కూడా తెలుసనుకోండి. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వి కపూర్‌ని అనుకున్నారు. కానీ ఇప్పుడు కృతి శెట్టిని తీసుకుంటున్నారని టాక్ నడుస్తోంది.
బంగార్రాజు సినిమా తర్వాత కృతికి ఒక్క హిట్ పడలేదు. దాంతో పెద్దగా ఇక్కడ అవకాశాలు కూడా రాలేదు. ఈ గ్యాప్‌లో తమిళం, మలయాళం సినిమాల్లో నటించేసింది. వరుస ఫ్లాప్స్‌తో సతమతమవుతున్న కృతిని ప్యారడైజ్ మళ్లీ ట్రాక్‌లో పడేస్తుందో లేదో చూడాలి. ఒకవేళ కృతి శెట్టిని తీసుకుంటున్నట్లైతే.. ఇది నాని, కృతి కాంబినేషన్‌లో రాబోయే రెండో సినిమా అవుతుంది. 2021లో వచ్చిన శ్యాం సింఘా రాయ్ సినిమాలో కృతి నాని కలిసి నటించిన సంగతి తెలిసిందే.