America China అమెరికా దేశంలోని పంటలను నాశనం చేసేందుకు చైనా కుట్ర పన్నుతోందా? అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే ఇలాంటి అనుమానం కలగకమానదు. టెక్సాస్, ఫ్లోరిడా, న్యూమెక్సికోలోని రైతుల ఇళ్ల ముందు విత్తనాల ప్యాకెట్లు ఉంటున్నాయట. ఇవేవీ వారు ఆర్డర్ చేయలేదని చెప్తున్నారు. పైగా అవన్నీ కూడా చైనీస్ కంపెనీలకు చెందిన విత్తనాలు. టెక్సాస్‌కి చెందిన వ్యవసాయ శాఖ కమిషనర్ సిడ్ మిల్లర్ రంగంలోకి దిగి విచారణ చేపడుతున్నారు.
విత్తనాల ప్యాకెట్లు ముట్టుకోవడం.. వాటిని తెరిచి చూడటం వంటివి కూడా చేయొద్దు అని హెచ్చరికలు జారీ చేసారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అయితే.. ఇది బ్రషింగ్ స్కామ్ కూడా అయ్యుండొచ్చని భావిస్తున్నారు. బ్రషింగ్ స్కామ్ అంటే.. కొన్ని కంపెనీలు కావాలని ఫేక్ రివ్యూలు పుట్టించేందుకు ఇలా ఆర్డర్ చేయకుండానే కొన్ని ప్రొడక్టులను ఇళ్ల ముందు వదిలేసి వెళ్తుంటారు. ఇలాంటి స్కామే 2020లో అమెరికాలో చోటుచేసుకుంది.





