Deepam: మనం రోజూ చేసే నిత్య దీపారాధనలో సంధ్యా దీపానికి కాస్త ప్రాధాన్యత ఎక్కువ ఇస్తుంటారు. సూర్యాస్తమయం తర్వాత చేసే దీపారాధన వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది అని పెద్దలు చెప్తుంటారు. అయితే సంధ్యా సమయంలో చేసే దీపారాధనలో దీపంలో ఇవి వేస్తే ఎంతో మంచిదట. అవేంటంటే..
దీపం పెట్టాక ఆ నూనెలో ఒక లవంగం వేస్తే ఎంతో మంచిదట. ఇలా చేయడం వల్ల రాహు, కేతువులు శాంతిస్తారని చెప్తారు. జాతకంలో రాహు, కేతు సమస్యలు కూడా తగ్గుతాయట.
దీపం నూనెలో బిర్యానీ ఆకు పొడి చేసి వేసినా మంచిదే. లక్ష్మీ దేవి, కుబేరుడి ఆశీర్వాదం ఉంటుంది. దీపం పెట్టేటప్పుడు బిర్యానీ ఆకులను నలిపి పొడి చేసి నూనెలో వేస్తే ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి.
పితృదేవతలు, శనిదేవుడి అనుగ్రహం పొందాలంటే దీపం పెట్టేటప్పుడు నూనెలో కొద్దిగా నువ్వులు వేయండి. శని అనుగ్రహం కూడా ఉంటుంది.