Hero Scolds Rashmika Mandanna: నటి రష్మిక మందన కాలికి దెబ్బ తగిలినా కుంటుకుంటూ తన కొత్త సినిమా ఛావా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఈ హిందీ సినిమాలో విక్కీ కౌశల్ హీరోగా నటించారు. రష్మిక కాలికి దెబ్బ తగిలినప్పటి నుంచి ఆమెను ప్రమోషన్స్‌లో పాల్గొనద్దని.. రెస్ట్ తీసుకోవాలని ఛావా నిర్మాతలు కూడా చెప్పారట. తగినంత రెస్ట్ తీసుకుంటేనే త్వరగా కోలుకుంటావని వైద్యులు చెప్పినప్పటికీ రష్మిక అవేమీ లెక్కచేయకుండా విరివిగా ప్రమోషన్స్‌లో పాల్గొంటోంది. దీనిపై ఇప్పటికే చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అంత నొప్పి ఉన్నప్పుడు రెస్ట్ తీసుకోకుండా ఏదో పెద్ద ఉపకారం చేస్తున్నట్లు ఎందుకింత ఓవరాక్షన్ అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.
హిందీ వాళ్లే కాదు.. మన వాళ్లు కూడా సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్‌లపై ఇలాంటి కామెంట్సే చేస్తున్నారు. కానీ రష్మిక ఇవేమీ పట్టించుకోవడం లేదు. అయితే.. విక్కీ కౌశల్ కూడా ఈ విషయంలో కాస్త ఇరిటేట్ అయినట్లు ఉన్నారు. వీరిద్దరూ కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు.. విక్కీ తన మనసులో మాట బయటపెట్టారు. వైద్యులు రెస్ట్ తీసుకోవాలని అని చెప్పినప్పుడు తీసుకుంటే బాగుంటుంది. అలాకాకుండా జిమ్‌కి వెళ్తూ ఇలా కుంటుకుంటూ ప్రమోషన్స్‌లో పాల్గొనాల్సిన అవసరం లేదు కదా అని నవ్వుతూనే సెటైర్ వేసారు. ఇందుకు రష్మిక కూడా నవ్వి ఊరుకున్నారు. రష్మిక అలా కుంటుతూ వచ్చిన ప్రతీసారి విక్కీ ఆమె చేయి పట్టుకుని నడిపించాల్సి వస్తోందట. ఇది ఆయనకు కూడా కాస్త ఇబ్బంది కలిగించే అంశమే కదా..!