Donald Trump Prince Harry | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అక్రమంగా అమెరికాలోకి చొరబడిన విదేశీయులను ఇంటికి పంపిచేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 400 మంది భారతీయులను ప్రత్యేక విమానంలో ఇక్కడికి పంపించేసారు. అక్రమ వలసదారులు ఎక్కడున్నా విడిచిపెట్టకుండా వారి నుంచి పాస్‌పోర్ట్, వీసాలు లాక్కుని పింపిచేస్తున్నారు. అయితే.. హాలీవుడ్ నటి మేఘన్ మార్కెల్‌ను వివాహం చేసుకుని ఆమె కోసం బ్రిటన్ రాజకుటుంబం నుంచి ఆ బిరుదును వదులుకుని మరీ బయటికి వచ్చేసిన ప్రిన్స్ హ్యారీ విషయంలో మాత్రం ట్రంప్ కాస్త జాలి చూపిస్తున్నారు. ప్రిన్స్ హ్యారీ కూడా అక్రమంగా అమెరికాలో ఉంటున్న పౌరుడే.
ఆయనకు అక్రమంగా అమెరికాలో ఉండాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారా? ఆయన అక్రమంగా అమెరికాకు రాలేదు కానీ.. వీసాకు దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆయనకు డ్రగ్స్ వాడే అలవాటు ఉందన్న విషయాన్ని అధికారులకు చెప్పలేదని.. దాంతో ఆయన వీసాను క్యాన్సిల్ చేయాలని అమెరికాకి చెందిన హెరిటేజ్ ఫౌండేషన్ అనే సంస్థ ఆరోపణలు చేస్తోంది. దాంతో ట్రంప్ దృష్టి హ్యారీపై పడింది. అయితే.. హ్యారీని ఇబ్బంది పెట్టొద్దని ట్రంప్ అధికారులకు చెప్పారట. ఎందుకంటే.. ఆల్రెడీ హ్యారీ తన భార్య మేఘన్ మార్కెల్ పెడుతున్న టార్చర్‌ని తట్టుకోలేకపోతున్నాడని.. ఈ సమయంలో అతని వీసా చెక్ చేయడాలు.. అమెరికా నుంచి పంపించేయడాలు వంటివి చేయకపోవడమే మంచిదని చెప్పారట. దాంతో ఈ అంశం కాస్తా అమెరికాలో వైరల్‌గా మారింది.