Allu Arjun: పుష్ప సినిమాతో జాతీయ అవార్డును దక్కించుకుని.. పుష్ప 2 సినిమాతో అంతర్జాతీయ రేంజ్‌కి ఎదిగిపోయారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన పడిన కష్టమే ఈరోజు తనను ఈ స్థాయిలో నిలబెట్టింది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా పుష్ప 2 సినిమాతో ఆయన నార్త్ మార్కెట్‌ను డామినేట్ చేసేసారు. ఒక తెలుగు హీరోకి ప్యాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే.. వారిని ఎలాగైనా తమ సినిమాలో పెట్టుకుని సౌత్ మార్కెట్లో ప్రాఫిట్స్ పొందాలని చూస్తుంటుంది బాలీవుడ్ చిత్ర పరిశ్రమ. టాలీవుడ్, బాలీవుడ్ అని కాకుండా మనది భారతీయ చిత్ర పరిశ్రమ అని చెప్పుకోవాలి.
ఇక బన్నీ వంతు
ఇది ముమ్మాటికీ నిజమే కానీ.. బాలీవుడ్ వాళ్లు అలా అనుకోరు. ఒకప్పుడు అది నేషనల్ ఫిలిం ఇండస్ట్రీగా తెగ డామినేట్ చేసేది. పలుమార్లు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలు తీసే సినిమాలను కనీసం సినిమాగా కూడా గుర్తించేది కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. RRR సినిమాతో ఆస్కార్ మన సొంతం కావడంతో ఇప్పుడు హాలీవుడ్ తెలుగు సినిమాని ఓ రేంజ్లో చూస్తోంది. బాలీవుడ్‌కి అంత ప్రాముఖ్యత ఇవ్వడం లేదు. దాంతో బాలీవుడ్ మన తెలుగు వారిని తమ సినిమాల్లో తీసుకుంటోంది. వార్ 2 సినిమాతో ఆల్రెడీ మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ చేసేసారు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు. (Allu Arjun)
నార్త్ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ
రెండు రోజుల క్రితం అల్లు అర్జున్ ముంబైకి వెళ్లారు. బాలీవుడ్లో టాప్ దర్శకులలో ఒకరైన సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్‌కి బన్నీ వెళ్లారు. దాదాపు గంట పాటు చర్చలు జరిగాయి. దాంతో వీరి కాంబినేషన్లో ఓ మాంచి సినిమా రాబోతోందనే టాక్ మొదలైపోయింది. తెలుగు వాళ్లు ఎలా ఫీలవుతున్నారో తెలీదు కానీ నార్త్ ఫ్యాన్స్ మాత్రం అల్లు అర్జున్.. భన్సాలీ కాంబినేషన్లో ఓ సినిమా పడితే చూడాలని ఉందని తెగ ఆరాటపడిపోతూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.
సంజయ్ లీలా భాన్సాలీని బాలీవుడ్ రాజమౌళి అంటుంటారు. కాబట్టి ఆయనతో సినిమా అంటే ఏ రేంజ్లో ఉంటుందో బాజీరావు మస్తానీ, పద్మవాతి, గంగుబాయి కఠియవాడి సినిమాలు చూసిన వారికి తెలిసే ఉంటుంది. అలాంటి దర్శకుడితో అల్లు అర్జున్ సినిమా అంటే పూనకాలే. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే.. ఇక్కడ అసలు మ్యాటర్ ఏంటంటే.. ఆల్రెడీ సంజయ్ లీలా భన్సాలీ ఆలియా భట్, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్‌లతో లవ్ అండ్ వార్ అనే సినిమా తీస్తున్నారట.
అది పెద్ద తప్పే
ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని ఓ క్యారెక్టర్లో తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అదే నిజం అయితే.. మన టాలీవుడ్లో టియర్ వన్ హీరోగా ఉన్న అల్లు అర్జున్‌ని బాలీవుడ్ టియర్ 2 కేటిగిరీలోకి మార్చేసినట్లే. అగ్ర హీరోగా సినిమా చేయాల్సిన అల్లు అర్జున్‌కి కేవలం ఏదో సైడ్ క్యారెక్టర్ ఇస్తే ఫ్యాన్స్ ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు. ఏమన్నా అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్లో కనిపిస్తారు.. సినిమాలో ఆయన క్యారెక్టరే కీలకం అని సోది కబుర్లు చెప్తుంటారు. ఇందులో ఎంత నిజం ఉందో అల్లు అర్జున్‌కే తెలియాలి. ఒకవేళ లవ్ అండ్ వార్ సినిమాలో అల్లు అర్జున్‌కి ఓ క్యారెక్టర్ ఇస్తున్న మాట నిజమే అయితే.. దానిని బన్నీ తిరస్కరించడం బెటర్. (Allu Arjun)
ఇక త్వరలో అల్లు అర్జున్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో మరో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా అలవైకుంఠపురంని మించి గ్రాండ్‌గా ఉండబోతోందట. 2026 డిసెంబర్లో కానీ 2027 జనవరిలో కానీ సినిమా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.