Operation Sindoor: పాకిస్థాన్‌లో నక్కి ఉన్న ఉగ్రమూకను మట్టుబెట్టేందుకు భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన నేపథ్యంలో అప్పుడే ఈ పదాన్ని టైటిల్‌గా రిజిస్టర్ చేసుకునేందుకు బాలీవుడ్ ఎగబడుతోంది. ఇప్పటికే ఫిలిం ఛాంబర్‌కు 30 దరఖాస్తులు వచ్చాయి. దేశం, ఆర్మీకి సంబంధించిన ఘటనలు చోటుచేసుకుంటే వెంటనే దానిని సినిమాగా తీసేయాలని ముందుండే వారిలో అక్షయ్ కుమార్ ఒకరు.
ఈయన కంటే ముందు జాన్ అబ్రహం, ఉరి సినిమాను తీసిన ఆదిత్య ధర్‌తో పాటు పలువురు టాప్ బాలీవుడ్ నిర్మాతలు ఈ సినిమాను రిజిస్టర్ చేసుకునేందుకు నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచే అన్ని ఫిలిం ఛాంబర్లకు దరఖాస్తులు పంపుతున్నారట. దరఖాస్తులు వచ్చిన వాటిలో రెండు ప్రాంతీయ సినిమాలకు సంబంధించినవి ఉన్నాయని మిగతావన్నీ హిందీ సినిమాకు సంబంధించినవే అని ఫిలిం ఛాంబర్ సిబ్బంది తెలిపారు.
దరఖాస్తుల్లో పేర్కొన్న టైటిల్స్ ఇలా ఉన్నాయి
ఆపరేషన్ సింధూర్
ఆపరేషన్ సింధూర్ మాగ్నమ్
పహల్గాం: ది హారిఫిక్ టెర్రర్
ది పహల్గాం టెర్రర్
సింధూర్ ఆపరేషన్