Owaisi: పహల్గాం దాడిలో 28 మంది భారతీయులను పొట్టనబెట్టుకున్న ఉగ్రమూకల అంతు చూడాలన్న కసితో మనం రగిలిపోతుంటే పాకిస్థాన్ పుండు మీద కారం చల్లే వ్యాఖ్యలు చేస్తోంది. సింధూ నది మాది.. మా నీరు లాక్కుంటే ఆ నదిలో పారేది భారత్ వాసుల నెత్తురు అని బిలావల్ భుట్టే అనే పాక్ పిచ్చి శునకం చేస్తున్న వ్యాఖ్యలపై మన నేతలు మూతి పగిలేలా సమాధానం ఇస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నేత శశి థరూర్ రక్తం తప్పకుండా పారుతుంది కాకపోతే అది పాక్ వాళ్ల రక్తమే అని బదులిచ్చారు.
ఇప్పుడు AIMIM అధినేత అసదుద్దిన్ ఒవైసీ స్పందించారు. బిలావల్ భుట్టో ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థంకావడంలేదని.. వాళ్లమ్మ బేనజిర్ భుట్టోని చంపింది కూడా ఉగ్రవాదులే అన్న విషయం తెలుసుకుని అప్పుడు భారత్ గురించి కామెంట్ చేయాలని అన్నారు. మన కాల మానం ప్రకారం పాక్ వాళ్లు అరగంట వెనకున్నారు కానీ.. అభివృద్ధిలో మాత్రం అర శతాబ్దం వెనుకబడి ఉన్నారని ఎద్దేవా చేసారు. మతం మతం అని చంపేస్తున్నారని.. అసలు ఖురాన్‌లో ఎక్కడా అమాయకులను చంపాలని లేదని.. ఉగ్రవాదుల్ని పోషిస్తున్న పాక్ ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలని తెలిపారు. పాక్ జాతీయ బడ్జెట్ కంటే భారత్ మిలిటరీ బడ్జెట్ ఎక్కువగా ఉందని.. అసలు ఏం చూసుకుని పాక్ నేతలు విర్రవీగుతున్నారో అర్థంకావడంలేదని ఒవైసీ అన్నారు.