Asaduddin Owaisi: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. వెనెజ్వెలా అధ్యక్షుడు నికోలా మడురోని బంధించి న్యూయార్క్‌కు తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం ట్రంప్ వెనెజ్వెలాపై మిలిటరీ ఆపరేషన్స్ చేపట్టి మెరుపు దాడులు నిర్వహించారు. వెనెజ్వెలాకి ఎప్పటినుంచో మాదకద్రవ్యాలను అమెరికాకు తరలిస్తున్నారని కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇస్తూనే ఉన్నారు. ఎంత చెప్పినా మడురో వినలేదు. పైగా.. చాలా మటుకు మాదకద్రవ్యాలను నడిపే ముఠా సంస్థలతో కలిసి మడురో పనిచేస్తున్నారని ట్రంప్ ఆరోపణలు చేసారు.
ఇక తప్పక వెనెజ్వెలాపై దాడులు చేసి ఆ దేశ అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై పలు కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయబోతున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ, AIMIM పార్టీ అధ్యక్షుడు అసదుద్దిన్ ఒవైసీ కీలక వ్యాఖ్యలు చేసారు. తన దేశానికి ముప్పుగా భావించిన మడురోని ట్రంప్ ధైర్యం చేసి అతని దేశం నుంచే అతన్ని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చినప్పుడు.. భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌లో దాక్కున్న కరుడుగట్టిన నేరగాడు, 26/11 దాడుల మాస్టర్‌మైండ్ మసూద్ అజహర్‌ను ఎందుకు తీసుకురాలేకపోతున్నారని ప్రశ్నించారు. ట్రంప్ చేయగలిగినంది మోదీ కూడా చేయగలరు. అలాంటప్పుడు ఆయన ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.





