Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి కూడా మన బ్రహ్మానందం అంటే ఇష్టం అనుకుంటా. అందుకే ఆయన డైలాగ్‌తో డిజైన్ చేసిన టీషర్టును వేసుకుని వైరల్ అయిపోయారు. బ్రహ్మానందం ఫోటోలు.. దాని కింద నెల్లూరు పెద్దా రెడ్డి తాలూకా అని రాసున్న టీషర్ట్‌ను వేసుకుని బన్నీ బయటికి వచ్చారు. ఆ సమయంలో ఆయన వేసుకున్న టీషర్టు పైనే అందరి కళ్లున్నాయి. అసలు బన్నీ ఇలాంటి టీషర్టు వేసుకుంటారని కూడా ఎవ్వరూ ఊహించి ఉండరు.
అనగనగా ఒక రోజు సినిమాలో బ్రహ్మీ.. తనకు నెల్లూరు పెద్దా రెడ్డి తెలుసు అంటూ పోలీసుల ముందు ఇచ్చే బిల్డప్.. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దా రెడ్డి రైట్ నౌ అంటూ చెప్పే డైలాగ్ ఎంత పాపులరో అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్.. బ్రహ్మీ లేకుండా కామెడీ ఎక్కడ… మీమ్స్ ఎక్కడ చెప్పండి..!