శ‌బ‌రిమ‌ల చోరీ కేసులో న‌టుడు జ‌య‌రాంను విచారించిన అధికారులు

Sabarimala Theft Case ప్ర‌ముఖ న‌టుడు జ‌య‌రాంను కేర‌ళ‌కు చెందిన SIT అధికారులు ప్ర‌శ్నించారు. శ‌బ‌రిమ‌ల‌లో విలువైన ద్వార‌పాల‌కులకు అమ‌ర్చి ఉన్న బంగారు ప్లేట్ల అప‌హ‌ర‌ణ‌ కేసులో జ‌య‌రాం కీల‌క సాక్షిగా ప‌రిగ‌ణిస్తున్నారు.

ఈ చోరీ ఘ‌ట‌న 2016లో శ‌బ‌రిమ‌ల ఆల‌య పున‌ర్మిణాన స‌మ‌యంలో చోటుచేసుకుంది. ఆ స‌మ‌యంలో జ‌య‌రాం త‌న స్నేహితుడైన ఉన్నికృష్ణ‌న్ పొట్టితో క‌లిసి ద‌ర్శ‌నానికి వెళ్లారు. ఈ చోరీ కేసులో ఉన్నికృష్ణ‌న్ కీల‌క సూత్ర‌ధారి.

ప్ర‌ధాన ఆల‌యం ముందున్న ద్వార‌పాల‌కుల విగ్ర‌హాల‌కున్న బంగారు ప్లేట్ల‌ను, శ్రీకోవిళ్ ఆల‌య త‌లుపుల‌కు ప్లేటింగ్ వ‌ర్క్ చేయించాల‌ని చెప్పి ఆల‌య అధికారులు.. ప్ర‌ధాన కాంట్రాక్ట‌ర్ అయిన‌ ఉన్నికృష్ణ‌న్‌లు క‌లిసి చోరీకి పాల్ప‌డ్డారు.

ప్లేటింగ్ వ‌ర్క్ పూర్త‌య్యాక ప్లేట్ల‌ను, ఆల‌య ద్వారాల‌ను అమ‌ర్చారు కానీ తూకంలో తేడాలు క‌నిపించాయి. దాంతో భారీ చోరీ, మోసం జ‌రిగింద‌ని గుర్తించిన ఇత‌ర ఆల‌య అధికారులు వెంట‌నే పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు.

అప్ప‌టి నుంచి ఈ కేసు ఓ కొలిక్కి వ‌చ్చింది లేదు. దీంతో సుప్రీంకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ బంగారు ప్లేట్లు ఉన్న ప్ర‌దేశంలో ఉన్నికృష్ణ‌న్ 2019లోనే ప్ర‌త్యేక పూజ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ కార్య‌క్ర‌మంలో జ‌య‌రాం కూడా పాల్గొన్నారు. దాంతో అధికారులు జ‌య‌రాంను కేవ‌లం ప్ర‌ధాన సాక్షిగానే ప‌రిగ‌ణిస్తున్నామ‌ని తెలిపారు.

చోరీ స‌మ‌యంలో ఆల‌యంలోని బంగారు ప‌ళ్లాల‌ను బ‌య‌టికి త‌ర‌లించి తిరిగి వాటిని ఆలయానికి చేర్చార‌ని.. అయితే ఆ ప‌ళ్లాల బ‌రువు అస‌లైన ప‌ళ్లాల‌తో స‌రితూగ‌డం లేద‌ని గుర్తించారు.

2025లో ప్ర‌ధాన నిందితుడు పొట్టిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత కేర‌ళ కోర్టు ఈ కేసులో బెయిల్ ఇచ్చింది. కానీ ఇత‌నిపై మ‌రో దొంగ‌త‌నం కేసు కూడా ఉండ‌టంతో పొట్టి ప్ర‌స్తుతానికి జైల్లోనే ఉన్నాడు.

చోరీ బ‌య‌ట‌ప‌డిన స‌మ‌యంలో ఆల‌య పూజారి కంద‌రారు రాజీవ‌రుని కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రావ‌ణ్‌కోర్ ఆల‌య బోర్డు అడ్మినిస్ట్రేటివ్ అధికారి మురారి బాబుని అరెస్ట్ చేయ‌గా అత‌నికి బెయిల్ మంజూర‌య్యింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *