Search The Query
Search

Image
  • Home
  • News
  • భర్తను చంపి రాత్రంతా పోర్న్

భర్తను చంపి రాత్రంతా పోర్న్

Guntur గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివన‌గ‌రాజు అనే వ్యక్తికి 2007లో లక్ష్మీ మాధురి అనే మహిళతో వివాహం జ‌రిగింది.

వీరికి ఇద్ద‌రు సంతానం. అయితే.. శివనగ‌రాజు రెండు రోజులు క్రితం అనుమాస్పద స్థితిలో మృతిచెందాడు.

పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా… విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో టికెట్ కౌంటర్లో పనిచేస్తున్న క్రమంలో గోపి అనే వ్యక్తితో ల‌క్ష్మీ మాధురికి ప‌రిచ‌యం ఏర్పడి, అతనితో వివాహేతర సంబంధం పెట్టుకుంది.

శివ‌న‌గ‌రాజు చేస్తున్న ఉల్లిపాయల వ్యాపారం నచ్చక, అతన్ని హైదరాబాద్‌లో గోపి నిర్వహిస్తున్న కారు ట్రావెల్స్‌లో ఉద్యోగం చేసేందుకు పంపింది.

కొన్ని రోజుల తర్వాత శివనగరాజు సొంత గ్రామానికి తిరిగి రావడంతో, అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని అత‌న్ని చంపేందుకు ప్లాన్ వేసింది.

ఈ క్రమంలో రాత్రి బిర్యానీ వండి అందులో 20 నిద్రమాత్రలు కలిపి, భర్త గాఢ నిద్రలోకి వెళ్లాక, ప్రియుడిని ఇంటికి పిలిచి, అతనితో కలిసి శివ‌న‌గ‌రాజుని చంపేసింది.

గోపి ఛాతిపై కూర్చోగా, భర్త మొహంపై దిండు పెట్టి అతన్ని చంపేసి, గోపి వెళ్లిపోయాక రాత్రంత పోర్న్ వీడియోలు చూస్తూ గడిపింది.

ఉదయం 4 గంటలకు స్థానికులను పిలిచి, తన భర్త గుండెపోటుతో మృతిచెందినట్లు హడావిడి చేసింది.

మృతదేహం చెవిలో నుండి రక్తం రావడం, మొహంపై గాయాలు ఉండడం గమనించి, శివనగరాజు తండ్రితో కలిసి శివ స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేసారు.

దీంతో విచారణ జరిపి, ఛాతీ వద్ద ఎముకలు విరిగి ఊపిరాడకుండా చనిపోయాడని నిర్ధారించుకుని, ల‌క్ష్మీమాధురిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో ప్రియుడితో కలిసి తానే భర్తను హత్య చేసినట్లు అంగీక‌రించింది.

More News

Jagan reponds to ap assembly speaker ayyannapatrudu
“జీతాల‌పై ఆధార‌ప‌డేంత పేదోళ్లు కాదు మావాళ్లు”
BySai KrishnaJan 22, 2026

Jagan అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేల‌కు జీతాలు ఇవ్వ‌డం స‌రికాద‌ని ఇటీవ‌ల ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స్పీక‌ర్ అయ్య‌న్న‌పాత్రుడు వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి…

Pawan Kalyan congratulates mana shankara vara prasad movie
అన్న సినిమాకు శుభాకాంక్ష‌లు
BySai KrishnaJan 22, 2026

Pawan Kalyan మెగా బ్లాక్‌బస్టర్‌ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్ర బృందానికి ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ శుభాకాంక్షలు…

will jagan at least now stick to his words regarding padayatra
నిజ‌మేనా న‌మ్మ‌చ్చా?
BySai KrishnaJan 22, 2026

Jagan వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌చ్చే ఏడాది నుంచి పాద‌యాత్ర…

who will Pawan Kalyan select as Rajya sabha MP
ఆ త‌ప్పు చేయ‌కు ప‌వ‌న్
BySai KrishnaJan 22, 2026

Pawan Kalyan రాజ్య‌స‌భ‌లో జూన్ నాటికి నాలుగు ఎంపీ సీట్లు ఖాళీ కానున్నాయి. వాటిలో మూడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవి..…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top