పురుషులకు సైతం ఫ్రీ బస్!

AIADMK తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ద‌గ్గ‌ర‌ప‌డుతున్న స‌మ‌యంలో AIADMK పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. ప్రతి మహిళకు నెలకు రూ.2,000 ప్ర‌క‌టించింది. అమ్మ టూ వీలర్ స్కీమ్ కింద 5 లక్షల మందికి ద్విచక్ర వాహనంపై రూ.25,000 సబ్సిడీ, గ్రామీణ ప్రాంతాల్లో భూమి ఉన్నవారికి కాంక్రీట్ ఇండ్ల నిర్మాణం, 100 రోజుల ఉపాధి హామీ పనుల రోజులను 150కి పెంపు అని మేనిఫెస్టోలో పేర్కొంది. వీట‌న్నింటిలో హైలైట్‌గా నిలిచిన ప‌థ‌కం సిటీ బస్సుల్లో మహిళలతో పాటు పురుషులకు కూడా ఉచిత ప్రయాణం. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఆల్రెడీ మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం అమ‌ల్లో ఉన్న నేప‌థ్యంలో మ‌హిళ‌ల‌తో పాటు పురుషుల‌కు కూడా మేం ఉచితంగా బస్సు ప్ర‌యాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *