Congress MLA మగాళ్లు ఆడదాని అందాలు చూసి ఆపుకోలేక… తీర్థయాత్రలకు వెళ్లలేకే రేప్‌లు చేస్తుంటారు.. ఈ వ్యాఖ్యల్ని బాధ్యతగల పదవిలో ఉన్న ఓ పెద్దమనిషి చేసాడంటే నమ్ముతారా? మధ్యప్రదేశ్‌లోని భండేర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫూల్ సింగ్ భరైయా ఓ కార్యక్రమానికి హాజరై ఈ వ్యాఖ్యలు చేయడంతో వివాదాస్పదంగా మారింది.
పురుషులు ఆడదాని అందాన్ని చూసి ఆపుకోలేక వారిపై అత్యాచారాలు చేస్తారని.. కొందరు SC, ST, OBC కులాలకు చెందిన ఆడవాళ్లు అందంగా లేకపోయినా వాళ్లను కూడా రేప్ చేస్తుంటారని అన్నాడు. తక్కువ కులాలకు చెందిన ఆడవాళ్లపై, పసిపిల్లలపై అత్యాచారాలు చేయడానికి కారణం.. కొందరు తీర్థయాత్రలకు వెళ్లలేక కనీసం ఇలాంటి పనులు చేస్తే తీర్థయాత్రలకు వెళ్లినంత పుణ్యం వస్తుందని కొన్ని గ్రంథాల్లో చెప్పబడిందంటూ షాకింగ్ వ్యాఖ్యలు చేసాడు. పురుషులు అత్యాచారం చేస్తే అది కచ్చితంగా ఆడదాని తప్పే అంటూ వ్యాఖ్యానించడంతో కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర పార్టీలు భగ్గుమన్నాయి. అతని వ్యాఖ్యలకు మాకు ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ పార్టీ ఖండించింది.





