Mekathoti Sucharitha తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత తొలి దళిత హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మేకతోటి సుచరిత త్వరలో జనసేన పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆమెను కేబినెట్ నుంచి తొలగించడంతో సుచరిత అసంతృప్తిగా ఉన్నారు. అదీకాకుండా ఆమె 2019లో ప్రత్తిపాడు నుంచి ఆమె గెలిచినప్పటికీ.. 2024 ఎన్నికల్లో తాడికొండ నియోజకవర్గం నుంచి పోటీ చేయమని చెప్పడంతో అక్కడ పోటీ చేసి ఆమె ఓడిపోయారు.
కావాలనే ఆమెకు వేరే నియోజకవర్గం అప్పగించి ఓడిపోయేలా చేసారని సుచరిత భావిస్తున్నారట. అదీకాకుండా ప్రస్తుతం ప్రత్తిపాడు, తాడికొండలో సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నవారు తెలుగు దేశం పార్టీకి చెందినవారే. దాంతో ఇప్పుడు సుచరితకు తాడికొండపై ఎలాంటి ఆసక్తి లేదని తెలుస్తోంది. ఈసారి ఎన్నికల్లో జనసేన నుంచి ప్రతిపాడు టికెట్ ఆశిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.





