Search The Query
Search

Image
  • Home
  • Health
  • మ‌న శ‌రీర‌మే మ‌ద్యం త‌యారుచేస్తే?

మ‌న శ‌రీర‌మే మ‌ద్యం త‌యారుచేస్తే?

0Shares

Drinking మ‌ద్యం తాగాలంటే షాపుల‌కో బార్ల‌కో వెళ్లాలి. అంతేకానీ మ‌న శ‌రీర‌మే మ‌ద్యాన్ని త‌యారుచేయ‌డ‌మేంటి? అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే.. శాస్త్రవేత్త‌లు క‌నిపెట్టిన ఈ ఇంట్రెస్టింగ్ అంశాన్ని మీరు తెలుసుకోవాల్సిందే. మ‌ద్యం తాగాక మ‌నిషి అస‌లు త‌న చుట్టుప‌క్క‌ల ఏం జ‌రుగుతోందో కూడా గుర్తించ‌లేడు. త‌న లోకంలో త‌నుంటాడు. కానీ అస‌లు మ‌ద్యం అల‌వాటు లేనివాడు కూడా తాగిన‌ట్లు మైకంలో ఉంటే?

ఇలాంటి కేసుల‌ను ABS అంటారు. అంటే ఆటోమేటిక్ బ్రూవెరీ సిండ్రోమ్‌. మ‌నం మ‌ద్యం తాగ‌క‌పోయినా మ‌న క‌డుపులో మ‌ద్యం దానంత‌ట అదే ఏర్ప‌డుతుంది. అదెలాగంటే… కొన్ని గ‌ట్ బ్యాక్టీరియాలు కార్బోహైడ్రేట్స్‌ నుంచి ఇథ‌నాల్‌ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇథ‌నాల్ కూడా ఒక‌ర‌మైన ఆల్క‌హాలే. ఈ ఇథ‌నాల్ ర‌క్త‌నాళాల్లోకి వెళ్లి మ‌నిషిని మైకంలో ముంచుతుంది. అందుకే తాగ‌క‌పోయినా తాగిన‌ట్లు మ‌త్తుగా అనిపిస్తుంటుంది. కానీ పాపం ఇలాంటి స‌మ‌స్య ఉన్న‌వారు తాము తాగ‌లేద‌ని చెప్పినా ఎవ్వ‌రూ న‌మ్మ‌రు.

అయితే.. ఇలాంటి కేసులను వైద్యుల‌ను కూడా గుర్తించ‌లేక‌పోతున్నారు. ఒక మ‌నిషికి నీర‌సం, మాట త‌డ‌బ‌డ‌టం, మైకంలో ఉన్న‌ట్లు ఉండ‌టం ఇలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తే ముందుగా చేయాల్సింది బ్ల‌డ్ ఆల్క‌హాల్ టెస్ట్. అప్పుడు పేషెంట్స్‌కి ABS స‌మ‌స్య ఉందా లేదా అనేది తెలుస్తుంది. ఒక‌వేళ స‌మ‌స్య ఉంద‌ని తెలిస్తే మాత్రం వాళ్లు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఎందుకంటే.. ఇలాంటి వారు పాపం తాగ‌కుండా డ్రైవింగ్ చేస్తున్నా తాగిన‌ట్లే ఉంటుంది కాబ‌ట్టి పోలీసులు ప‌ట్టుకుంటారు. అయితే.. దీనికి చికిత్స లేదా అంటే ఉంది. దానిని FMT అంటారు. అంటే ఫీక‌ల్ మైక్రో బ‌యోటా ట్రాన్స్‌ప్లాంటేష‌న్. ఇది గ‌ట్ బ్యాట్లీరియా ఇమ్‌బ్యాలెన్స్‌ను త‌గ్గిస్తుంది. అయితే.. ABS అనేది చాలా అరుదైన స‌మ‌స్య కాబ‌ట్టి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

1 Comments Text
  • phl63 app login says:
    Your comment is awaiting moderation. This is a preview; your comment will be visible after it has been approved.
    The PHL63 app is where it’s at. This login link made accessing it super easy. Now I can play my slots anytime, anywhere. Mobile gaming FTW! phl63 app login
  • Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    JOIN US

    Get Newsletter

    Subscribe our newsletter to get the best stories into your inbox!

    Scroll to Top