Kona Venkat సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసారు తనని తాను క్రిటిక్ అని చెప్పుకునే కమల్ ఆర్ ఖాన్. ఇప్పటివరకు స్పిరిట్ సినిమాకు సంబంధించిన షూటింగ్ మూడు రోజులు మాత్రమే జరిగిందని.. ఇప్పటికైనా సమయం మించిపోలేదని సినిమాను ఆపేయాలని కమల్ సందీప్ రెడ్డి వంగాను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేసాడు.
అంతేకాదు.. ప్రభాస్, వివేక్ ఒబెరాయ్‌లు బ్యాడ్ లక్ అని.. వారితో సినిమాలు చేస్తే అది కచ్చితంగా సందీప్ ఖాతాలో డిజాస్టర్ అవుతుందని వివాదాస్పద వ్యాఖ్యలు చేసాడు. కమల్ చేసిన ట్వీట్‌కు రచయిత కోన వెంకట్ స్పందించారు. ఈ జోకర్ గాడిని ఎవరైనా హైదరాబాద్‌కు తీసుకురండి. కేవలం వన్ వే టికెట్ సరిపోతుంది అని మండిపడ్డారు.





