Crime News 8 ఏళ్లుగా సెక్స్‌కి ఒప్పుకోవడం లేదని ఓ వ్యక్తి కట్టుకున్న భార్యను దారుణంగా చంపేసిన ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో చోటుచేసుకుంది. జనవరి 9న నిందితుడు కలయిక విషయంలో భార్యతో గొడవపడ్డాడు. మాటా మాటా పెరిగడంతో క్షణికావేశంతో ఆమె గొంతు నులిమి చంపేసాడు. చనిపోయిందని తెలిసి ఏమీ తెలీనట్లు దగ్గర్లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లి పై నుంచి కిందపడి చనిపోయిందని చెప్పాడు. డాక్టర్లు పోస్ట్‌మార్టం చేయగా ఆమె ఊపిరాడక చనిపోయిందని నిర్ధారించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకోగా తానే చంపేసానంటూ కన్నీరుపెట్టుకున్నాడు. పోలీసుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.