Viral News పొగత్రాగుట ఆరోగ్యానికి హానికరం. ఇది నూటికి నూరు పాళ్లు నిజం. ఈ వార్త చదివాక పొగత్రాగినందుకే అతను ఇన్నేళ్లు బతికాడు అనుకుంటే అది కచ్చితంగా పొరపాటే. ప్రపంచంలో ఎక్కడో మారు మూల జరిగిన ఓ వింత గురించి మీతో పంచుకోవడానికి మాత్రమే ఈ ఆర్టికల్ రాసామని దయచేసి అర్థంచేసుకోగలరు.
దక్షిణాఫ్రికాకి చెందిన జాన్ స్టీన్బర్గ్ అనే వ్యక్తికి 12వ యేట నుంచే పొగత్రాగే అలవాటు ఉందట. 1904 డిసెంబర్ 31న జాన్ జన్మించాడు. చదువకునే స్తోమత లేదు. దాంతో చేపలు పట్టడం, శవాలను పూడ్చే పనులు చేయడం వంటివి చేస్తూ జీవనం సాగించాడు. ఇతనికి 12వ యేట నుంచే పొగతాగే అలవాటు ఉంది. చిన్నాచితకా పనులు చేసుకుంటూ తాను ఇష్టమపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల్ని కన్నాడు. వారిని చదివించి పెళ్లిళ్లు చేసి మనవళ్లు, మునిమనవళ్లను కూడా చూసాడు.
2025 డిసెంబర్ 31న తన 121వ పుట్టినరోజు. పుట్టిన రోజు జరుపుకున్న కొన్ని గంటల్లోనే జాన్ కన్నుమూసాడట. అయితే.. అతనికి పొగతాగే అలవాటున్నా హెర్బల్ డ్రింక్స్ ఎక్కువగానే తీసుకునే అలవాటు ఉందట. అందుకే ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు. నిజానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వయస్కుడు జామో మారిన్హక్ష నేతో. ఇతని వయసు 113. కానీ ఇతని కంటే పెద్ద వయస్కుడు జాన్. అయితే.. ఇతన్ని మాత్రం అత్యంత పెద్ద వయస్కుడిగా గిన్నీస్ రికార్డుల్లోకి ఎక్కించకపోవడం గమనార్హం.





