Pawan Kalyan సినిమాల్లో తాను నెంబర్ 1 కాకపోవచ్చు కానీ హీరో స్థాయిలో తాను బాగా డబ్బులు సంపాదించగలిగే నటుడ్నని అన్నారు సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. సంక్రాంతి సందర్భంగా తన నియోజకవర్గమైన పిఠాపురంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా ఫ్లాప్ అయినా డబ్బులు చేసుకునే అవకాశం ఉన్న వాడినని తెలిపారు.
కానీ, రాజకీయం పరంగా మాత్రం తాను బాధ్యత అనుకొని రాజకీయాల్లోకి వచ్చానని…. డబ్బు సంపాదన కోసం కాదని వెల్లడించారు. పవన్ అంటే గిట్టని వారు, ప్రతిపక్ష పార్టీ నేతలు ఆయన్ను ప్యాకేజీ స్టార్ అని సంబోధిస్తూ ట్రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రశ్నిస్తానని తెలుగు దేశం పార్టీతో చేతులు కలిపి కావాల్సిన ప్యాకేజ్ తీసుకుని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ చెప్పినదానికి ఊ కొట్టి ఊరుకోవడం తప్ప పవన్ చేస్తోంది ఏమీ లేదనే ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. తనపై వస్తున్న ఈ ట్రోలింగ్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టేందుకు పవన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.





