Jagan Mohan Reddy ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన PPP మోడల్ విషయంలో ఎవరన్నా టెండర్లు వేస్తే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరెస్ట్‌లు చేస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ మోడల్‌ను అమలు చేయనివ్వకుండా కోటి సంతకాల సేకరణ చేసి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్వయంగా గవర్నర్‌ను కలిసి అభ్యర్ధించారు. దీనిపై జగన్‌ను ఓ రిపోర్టర్ ఒక ప్రశ్న అడిగారు.
రిపోర్టర్: సర్..PPP విషయంలో టెండర్లు వేసేందుకు ఎవ్వరూ ముందుకు రావడం లేదని ఏపీని బాగు చేయాలని చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతోందని కూటమి ఆరోపణలు చేస్తోంది. దీని గురించి మీ స్పందనేంటి?
జగన్ : మంచిదే కదా స్వామి. ఎవ్వరూ రావొద్దనే కదా మేం కోటి సంతకాల సేకరణ చేసి గవర్నర్‌కు ఇచ్చింది. సంతోషించాల్సింది పోయి బాధెందుకు. ఇది బిగ్గెస్ట్ స్కాం ఆఫ్ ది డికేడ్.
రిపోర్టర్: జగన్ ఉంటే ఏపీ శ్రీలంక, సోమాలియాలా మారిపోతుందని తెలుగు దేశం పార్టీ వాళ్లన్నారు. దీనిపై మీ అభిప్రాయమేంటి?
జగన్: నువ్వే ఏదన్నా కొత్త దేశం పేరు కూడా చెప్పాలబ్బా..





