ఈ ఏడాది విదేశీయానం ఉన్న రాశులివే

2026 వ‌చ్చేసింది. అంద‌రూ న్యూఇయ‌ర్ సంబ‌రాల్లో మునిగి తేలుతున్నారు. క‌నీసం ఈ సంవ‌త్స‌రం నుంచైనా అదృష్టం వ‌రిస్తుందా.. మంచి రోజులు వ‌స్తాయా అని ఎదురుచూసేవారు కోకొల్ల‌లు. అయితే.. జ్యోతిష్య శాస్త్రం ప్ర‌కారం.. కొన్ని రాశుల వారికి ఈ ఏడాది విదేశీయానం ఉంద‌ట‌. ఆ రాశులేవో తెలుసుకుందాం.

ధ‌నుస్సు (Sagittarius)

ధ‌నుస్సు రాశి వారికి స‌హ‌జంగానే ప్ర‌యాణించాలి అనే కుతూహ‌లం ఎక్కువ‌గా ఉంటుంది. ఈ ఏడాది విదేశీయానం చేసే సూచ‌న‌లు ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి మే నెల మ‌ధ్య‌లో ఎప్పుడైనా ప్ర‌యాణించాల్సి రావ‌చ్చు.

మిథునం (Gemini)

మిథున రాశి వారు ఈ 2026లోకి యాక్ష‌న్‌లోకి దిగ‌నున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త అవ‌కాశాలు వ‌స్తాయి. మే నుంచి జూన్ మ‌ధ్య‌లో విదేశీయానం కూడా ఉంది.

కుంభ‌ (Aquarius)

ఈ రాశి వారి ఆలోచ‌న‌ల‌కు హ‌ద్దులే ఉండ‌వు. కుంభ రాశిలోకి రాహు ప్ర‌వేశం జ‌ర‌గ‌బోతోంది. దీని వ‌ల్ల స‌హ‌జంగానే ప్ర‌యాణించాల‌నే ఆలోచ‌న‌లు వ‌స్తుంటాయి. జ‌న‌వ‌రి 21 నుంచి ఫిబ్ర‌వ‌రి 6 వ‌ర‌కు మ‌ళ్లీ జులై, ఆగ‌స్ట్ నెల‌ల్లో ప్ర‌యాణాలు చేసే అవ‌కాశాలు ఉంటాయి. 

మ‌క‌ర‌ (Capricorn)

జూన్ నుంచి అక్టోబ‌ర్ మ‌ధ్య‌లో విదేశీయానం చేసే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. చ‌దువు, కెరీర్ కోసం ప్ర‌యాణాలు చేసే అవ‌కాశం ఉంది.

మీనం (Pisces)

మీరు ఎక్కువ‌గా ఆధ్యాత్మిక ప్ర‌యాణాలు చేసే వీలుంది. 2026 జ‌న‌వ‌రి నుంచి ఫిబ్ర‌వ‌రి నెల‌ల్లో న‌వంబ‌ర్ నుంచి డిసెంబ‌ర్ నెల‌ల్లో ప్ర‌యాణాలు చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *