Man Sues Fiance: కాబోయే భార్య‌పై కేసు.. షాకైన జ‌డ్జి

Man Sues Fiance: ఇంకొన్ని రోజుల్లో పెళ్లి జ‌ర‌గాల్సి ఉండ‌గా… ఓ వ్య‌క్తి కాబోయే భార్య‌పై కేసు వేయ‌డంతో ఆ కేసు విన్న జ‌డ్జి విస్మ‌యానికి గుర‌య్యాడు. ఈ ఘ‌ట‌న చైనాలో చోటుచేసుకుంది. చైనాకి చెందిన హీ అనే వ్య‌క్తి ఓ డేటింగ్ యాప్‌లో వాంగ్ అనే అమ్మాయిని ప‌రిచ‌యం చేసుకున్నాడు. ఇద్ద‌రూ ప్రేమించుకోవ‌డంతో పెళ్లి చేసుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నారు. నిశ్చితార్థం కూడా జ‌రిగింది. చైనా సంప్ర‌దాయం ప్ర‌కారం.. నిశ్చితార్ధం స‌మ‌యంలో మెట్టినింటి వారు కాబోయే కోడలికి కొంత న‌గ‌దు కానుక‌గా ఇస్తారు. అలా హీ త‌ల్లిదండ్రులు వాంగ్‌కు 2.55 ల‌క్ష‌లు ఇచ్చారు.

పెళ్లికి ఇంకా స‌మ‌యం ఉంద‌న‌గా.. హీ నిర్వ‌హిస్తున్న ఓ హోట‌ల్‌లోనే వాంగ్ త‌న‌కు తోచిన సాయం చేసేది. అయితే.. వాంగ్ రోజూ అదే హోట‌ల్‌లో బిల్లు క‌ట్ట‌కుండా తిన‌డం.. హీ నుంచి న‌గ‌దు తీసుకుని త‌న‌కు న‌చ్చిన లోదుస్తులు కొనుక్కోవ‌డం వంటివి చేసేది. ఇది హీకి న‌చ్చ‌లేదు. ఇలాగే వ‌దిలేస్తే త‌న‌కు త‌న ద‌గ్గ‌ర ఉన్న డ‌బ్బంతా ఖ‌ర్చు చేసేస్తుంద‌ని హీకి అర్థ‌మైంది. ఆమెది నిజ‌మైన ప్రేమ కాద‌ని.. కేవ‌లం త‌న‌ను వాడుకోవ‌డానికే రిలేష‌న్‌లో ఉంద‌ని భావించి కోర్టులో కేసు వేసాడు.

ఈ క‌థ విని జ‌డ్జి కూడా జుట్టు ప‌ట్టుకున్నాడు. ఇప్పుడు నీకు ఏం కావాలి అని హీని జ‌డ్జి అడగ్గా.. త‌న తల్లిదండ్రులు కానుక‌గా ఇచ్చిన డ‌బ్బుతో పాటు త‌న నుంచి వాడుకున్న డబ్బు కూడా వాంగ్ తిరిగిచ్చేయాల‌ని డిమాండ్ చేసాడు. అయితే.. హీ త‌ల్లిదండ్రులు ఇచ్చిన డ‌బ్బులో స‌గం చెల్లించాల‌ని జ‌డ్జి తీర్పు ఇచ్చాడు. ఇక కానుక‌ల కోసం ఇచ్చిన డ‌బ్బు అనేది ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఎమోష‌న‌ల్ మూమెంట్ కాబ‌ట్టి ఈ విష‌యంలో కోర్టులు క‌ల‌గ‌జేసుకోలేవ‌ని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *