Sexual Act In Metro: ఈ మధ్యకాలంలో కొందరు జనాలు ఇంత కంటే నీచానికి ఏం దిగజారుతారులే అనుకునే కొద్దీ మరీ దారుణంగా ప్రవర్తించేస్తున్నారు. పబ్లిక్‌లోనే శృంగార కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. అది కూడా వందల మధ్య ఉన్న మెట్రో రైలులో. ఈ దరిద్రపు ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఢిల్లీ నుంచి మేరఠ్ వెళ్తున్న ర్యాపిడ్ మెట్రో రైలులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ మైనర్ బాలికతో ఓ యువకుడు కలిసి చేసిన ఈ వెధవ పని సీసీ కెమెరాలో రికార్డ్ అవడంతో వీడియో బయటికి వచ్చింది.
దాంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో ప్రకారం.. వారు ఉన్న కంపార్ట్‌మెంట్లో చాలా తక్కువ మంది ఉండటంతో ఎవరూ చూడరన్న ఉద్దేశంతో ఇలా ప్రవర్తించారు. కనీసం అక్కడున్న ఇద్దరు ముగ్గురు ప్యాసెంజర్లు చోద్యం చూస్తూ ఉన్నారే తప్ప ఏ ఒక్కరూ నిలదీసింది లేదు. ప్రస్తుతానికి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుంటామని చెప్తున్నారే కానీ ఇలాంటి ఘటనలకు మాత్రం ఫుల్‌స్టాప్ పెట్టడలేకపోతున్నారు.





