Search The Query
Search

Image
  • Home
  • Cinema
  • Akhanda 2: జ‌న‌నిగా సితార‌ను అనుకున్నారా?

Akhanda 2: జ‌న‌నిగా సితార‌ను అనుకున్నారా?

Akhanda 2: నంద‌మూరి బాల‌కృష్ణ న‌టించిన అఖండ 2 సినిమా యావ‌రేజ్ టాక్ అందుకుంది. బోయ‌పాటి శ్రీనివాస్ మాస్ ఎలివేష‌న్స్, లాజిక్ లేని స‌న్నివేశాలు సినిమాను ముంచేసాయి. అఖండ 2 విష‌యంలో ఏద‌న్నా హిట్ అయ్యింది అంటే.. అది బోయ‌పాటి, బాల‌య్య క‌లిసి హిందీ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూ మాత్ర‌మే. ఆల్రెడీ కాష‌న్ కియా అంటూ బోయ చెప్పిన డైలాగ్‌కు సోష‌ల్ మీడియా మీమ్స్‌తో నిండిపోయింది. స‌రే.. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. అఖండ 2 సినిమాలో కీల‌క పాత్ర ఏద‌న్నా ఉందంటే అది జ‌న‌ని. ఈ పాత్ర‌ను బాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్ హ‌ర్షాలీ మ‌ల్హోత్రా న‌టించింది.

బ‌జ‌రంగీ భాయ్‌జాన్ సినిమాలో హ‌ర్షాలీ మున్నీ పాత్ర‌కు విప‌రీత‌మైన ఫేమ్ వ‌చ్చేసింది. అప్పుడు చిన్న పిల్ల ముద్దుగా ఉంది కాబ‌ట్టి ఏదో వ‌ర్క‌వుట్ అయ్యింది. నిజానికి ఆ అమ్మాయికి న‌ట‌న రాదు. డైలాగ్ డెలివ‌రీ అంత‌క‌న్నా రాదు. అలాంటి అమ్మాయికి కీల‌క పాత్ర ఇచ్చారు. అయితే.. ఈ పాత్ర కోసం ముందు సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు కూతురు సితారను అనుకున్నార‌ట‌. అంతేకాదు.. ప్ర‌ముఖ త‌మిళ న‌టుడు సూర్య కూతురు దియాను కూడా అనుకున్నార‌ట‌. చివ‌రికి హ‌ర్షాలీ మ‌ల్హోత్ర‌ను తీసుకున్నారు. ఈ విష‌యం సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతోంది. మ‌హేష్ బాబు, సూర్య అభిమానులు హ‌మ్మ‌య్య.. ఆ ఇద్ద‌రు అమ్మాయిలు త‌ప్పించుకున్నార్రా బాబూ.. బ‌హుశా వీరికి IQ 220 లేదేమో అంటూ ఫ‌న్నీ కామెంట్స్ పెడుతున్నారు. 

More News

man lures a boy for momos and stole gold
మోమోల కోసం బంగారం ఇచ్చేసాడు
BySai KrishnaFeb 2, 2026

Momos ఆ బాలుడికి మోమోలంటే చాలా ఇష్టం. మాటిమాటికీ స్కూల్ నుంచి వ‌స్తూ ఓ బండి వ‌ద్ద ఆగి మోమోస్…

Vangaveeti Narendra Strong Counter to Chandrababu Over Ambati Rambabu
నాడు రంగా.. నేడు అంబ‌టి
BySai KrishnaFeb 2, 2026

Vangaveeti Narendra వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబ‌టి రాంబాబుపై దాడి చేయడం ఆ త‌ర్వాత ఆయ‌న్ను అరెస్ట్ చేసి…

Donald trump big claim on india oil imports
భార‌త్ ఆ దేశం నుంచే చ‌మురు కొంటుంది
BySai KrishnaFeb 1, 2026

Donald Trump అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ భార‌త‌దేశ చ‌మురు దిగుమతుల‌పై కీల‌క వ్యాఖ్య‌లు చేసారు. ఇక నుంచి భార‌త్…

Nara Rohit slams Ambati Rambabu on X
నీ నుంచి సంస్కారం ఆశించ‌డంలో అర్థం లేదు
BySai KrishnaJan 31, 2026

Nara Rohit  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై అస‌భ్య‌క‌ర‌మైన వ్యాఖ్య‌లు చేసారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత అంబ‌టి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!

Scroll to Top