Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ పోటీ గురించి చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. తన తండ్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఆయన ఓ ట్వీట్ వేసారు. ఓ పక్క నాన్న బిజినెస్ రీఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అమ్మకు గోల్డోన్ పీకాక్ అవార్డు, భార్య మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్ ఇన్ బిజినెస్ అనే అవార్డు దక్కించుకున్నారు. ఇంకోపక్క నేను ఎన్నికల్లో పోటీ పడటం కంటే ఇంట్లో వారితో పోటీ పడటమే కష్టం అని రియలైజ్ అవుతున్నాను అని ట్వీట్ చేసారు.