Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మామగారు పద్మారెడ్డికి నీవా బూమా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ షాకిచ్చింది. బీమా క్లెయిమ్ తిరస్కరించింది. 2024 మే 13న పద్మారెడ్డి గుండెనొప్పితో మెడికవర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్సకు అయిన రూ.23.50 లక్షలు కాగా.. ఆ ఖర్చును ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాలనుకున్నారు. తీరా చూస్తే ఆ కంపెనీ బీమాను తిరస్కరించింది. గత ఐదేళ్లుగా ప్రీమియం చెల్లిస్తూ.. రూ.20 లక్షల పాలసీని రెన్యూవల్ చేసుకున్నా ఇన్సూరెన్స్ తిరస్కరించారని పద్మారెడ్డి తెలిపారు. తనకు మూడేళ్లు ఉన్నప్పటి నుండే పోస్ట్ పోలియో పెరాలసిస్‌తో బాధపడుతున్నానని.. పాలసీ తీసుకున్నప్పుడు అభ్యంతరం చెప్పకుండా ఇప్పుడు క్లెయిమ్ తిరస్కరించారని ఇన్సూరెన్స్ కంపెనీపై ఫిర్యాదు చేసారు.