Hema: న‌టి హేమ ఇంట విషాదం

Hema: టాలీవుడ్ న‌టి హేమ ఇంట విషాదం నెల‌కొంది. ఆమె త‌ల్లి కోళ్ల లక్ష్మి అనారోగ్యంతో రాజోలులో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న హేమ ఉదయం స్వగ్రామానికి చేరుకున్నారు. త‌ల్లి మృత‌దేహాన్ని చూసి క‌న్నీరుమున్నీర‌య్యారు. గ‌తేడాది ఆమె క‌ర్ణాట‌క‌లోని ఓ ఫాం హౌస్‌లో డ్ర‌గ్స్ రాకెట్‌లో ఇరుక్కున్న ఘ‌ట‌న సంచ‌ల‌నంగా మారిన సంగ‌తి తెలిసిందే. తాను డ్ర‌గ్స్ తీసుకోలేద‌ని చెప్పినా చాలా మంది వ్యక్తిగ‌తంగా ఆరోప‌ణ‌లు చేస్తున్నార‌ని.. ఈ విష‌యం తెలిసి త‌న త‌ల్లి ఎంతో కంగారుప‌డ్డార‌ని తెలిపారు. ఆ త‌ర్వాత పోలీసులు హేమ బ్ల‌డ్ సాంపుల్స్ క‌లెక్ట్ చేసి ప‌రీక్ష‌లు చేయ‌గా హేమ డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు నిరూపిత‌మైంది. ప్ర‌స్తుతం ఆమె బెయిల్‌పై ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *