piracy punishment: చూసిన‌వాళ్ల‌కీ జైలే.. ఏ దేశాల్లో ఎలాంటి శిక్ష‌లు?

piracy punishment: తెలుగు రాష్ట్రాల్లో ఐబొమ్మ (ibomma) పైర‌సీ సంస్థ సంచ‌ల‌నాత్మ‌కంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ ఐబొమ్మ‌ను వెనకుండి న‌డిపిస్తున్న ఇమ్మ‌డి ర‌విని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసారు. విడాకుల నిమిత్తం ర‌వి నెద‌ర్లాండ్స్ నుంచి భార‌త్ రావ‌డంతో తెలంగాణ పోలీసులు చాక‌చ‌క్యంగా వ్య‌వ‌హ‌రించి అదుపులోకి తీసుకున్నారు. ఆ త‌ర్వాత అత‌ని చేతే ఐబొమ్మ‌ను పూర్తిగా మూసివేయించి క్ష‌మాప‌ణ‌లు కూడా చెప్పించారు. అయితే ర‌వికి ఈ పైర‌సీ నేరానికి పాల్ప‌డినందుకు గానూ ఎలాంటి శిక్ష ప‌డుతుందో పోలీసులు వెల్లడించ‌లేదు కానీ ఇత‌ర దేశాల్లో పైర‌సీకి పాల్ప‌డే వారిపై ఎలాంటి చ‌ర్య‌లు, ఎలాంటి క‌ఠిన శిక్ష‌లు ఉంటాయో చూద్దాం.

అమెరికా

ప్ర‌పంచం మొత్తంలో అత్యంత క‌ఠినమైన యాంటీ పైర‌సీ రూల్స్ ఉన్న‌ది అమెరికాలోనే. ఒక్క పైర‌సీ ఫైల్‌కి గానూ రూ.1.25 కోట్ల వ‌ర‌కు జ‌రిమానాతో పాటు ఐదేళ్ల పాటు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ పైర‌సీ వెబ్‌సైట్ న‌డిపిన‌ట్లు తెలిస్తే మాత్రం ప‌దేళ్ల వ‌ర‌కు జైల్లో పెడ‌తారు. ఇప్ప‌టివ‌ర‌కు అమెరికాలో రెండు పైర‌సీ కేసులు సంచ‌ల‌నంగా మారాయి. Jetflicks అని ఒక అమెరిక‌న్ పైర‌సీ వెబ్‌సైట్ న‌డుపుతున్నాడ‌ని తెలిసి అత‌నికి 57 నెల‌ల జైలు శిక్ష విధించారు. మెగా అప్లోడ్ అనే పైర‌సీ సంస్థ అధినేత కిమ్ డాట్‌కామ్ అనే వ్య‌క్తికి 20 ఏళ్ల‌కు పైగానే జైలు శిక్ష ప‌డింది. ఈ కేసు ఇంకా న‌డుస్తూనే ఉంది. అత‌ను జైల్లోనే ఉన్నాడు.

యూకే

ప‌దేళ్ల పాటు జైలు శిక్ష ప‌డే అవ‌కాశం ఉంటుంది. రూ. 50 ల‌క్ష‌ల వ‌ర‌కు జ‌రిమానా విధిస్తారు. ISP ట్రాకింగ్స్ ద్వారా నిందితుల‌ను ప‌ట్టుకుంటారు.

జ‌పాన్

కాపీరైట్ కంటెంట్‌ని డౌన్‌లోడ్ చేస్తే జపాన్ అత్యంత సీరియ‌స్‌గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటుంది. ఆసియా మొత్తంలో అత్యంత క‌ఠిన‌మైన పైర‌సీ చ‌ట్టాలు ఉండేది జ‌పాన్‌లోనే. కాపీరైట్, పైర‌సీ కంటెంట్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే రెండేళ్ల పాటు జైలు శిక్ష‌, 11 ల‌క్ష‌ల జ‌రిమానా క‌ట్టాలి. పైర‌సీ సైట్లు న‌డిపినా..ఆ సైట్ల‌లో సినిమాలు, డ్రామాలు చూపించినా రూ.55 ల‌క్ష‌ల వ‌ర‌కు జరిమానా, 10 ఏళ్ల వ‌ర‌కు జైలు శిక్ష ప‌డుతుంది. జ‌పాన్‌లో ప‌బ్లిష్ చేసిన వాడినే కాదు చూసిన వాళ్ల‌నీ క‌ఠినంగా శిక్షిస్తారు.

చైనా

ఏడేళ్ల పాటు జైలు శిక్షతో పాటు స‌ర్వ‌ర్లు నిలిపివేస్తారు. ఎందుకంటే చైనా పైర‌సీని దేశానికి ఆర్థిక ముప్పుగా భావిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *