Saudi Arabia Bus Accident: బ‌య‌ట‌ప‌డ్డ ఒకే ఒక్క‌డు

Saudi Arabia Bus Accident: సౌదీ అరేబియాలో ఈరోజు ఉద‌యం చోటుచేసుకున్న ఘోర బస్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌లో ఒకే ఒక్క‌డు బ‌య‌ట‌ప‌డిన‌ట్లు హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దిన్ ఒవైసీ తెలిపారు. ప్ర‌మాద విష‌యం తెలుసుకున్న ఆయ‌న వెంట‌నే రియాధ్‌లోని భార‌త దౌత్య‌కార్యాల‌యంలో ప‌నిచేస్తున్న డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిష‌న్ అబు జార్జితో సంప్ర‌దింపులు జ‌రిపారు. త‌న‌కు తెలిసిన స‌మాచారం ప్ర‌కారం బ‌స్సులో ప్రయాణిస్తున్న 42 మంది స‌జీవ‌ద‌హనం అయ్యార‌ని.. ఒక్క‌రు బ‌తికి బ‌య‌ట‌ప‌డిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు.

హైద‌రాబాద్‌కు చెందిన రెండు ట్రావెల్ ఏజెన్సీల ద్వారా 42 మంది మక్కా మ‌సీదుకు వెళ్లార‌ని తెలిసింద‌ని అన్నారు. మ‌సీదు నుంచి మెదీనాకు వెళ్తున్న స‌మ‌యంలో ఆయిల్ ట్యాంక‌ర్ బ‌స్సును ఢీకొట్ట‌డంతో ఒక్క‌సారిగా బ‌స్సు పేలిపోయింద‌ని తెలిపారు. ప్ర‌యాణికుల్లో 16 మంది మ‌ల్లేప‌ల్లిలోని బ‌జార్‌ఘాట్ ప్రాంతానికి చెందిన‌వారిగా గుర్తించామ‌ని తెలిపారు. హైద‌రాబాద్‌కి చెందిన ఆ రెండు ట్రావెల్ ఏజెన్సీల వివ‌రాలు తెలుసుకుని ప్ర‌యాణికుల వివ‌రాల‌ను సేక‌రించి రియాధ్‌లోని భార‌త దౌత్యాధికారుల‌కు పంపిన‌ట్లు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *