JR NTR ఎంత వయసు పెరిగినా తారక్ అభిమానులకు ఇప్పటికీ ఎప్పటికీ ఆయన యంగ్ టైగరే. తారక్ వయసు 42 సంవత్సరాలు. అయితే ఆయన నుంచి వచ్చిన రీసెంట్ సినిమా వార్ 2 లో తన లుక్స్‌తో తారక్ అదరగొట్టాడు. కానీ ఈ మధ్యకాలంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన బావమరిది నార్నె నితిన్ పెళ్లి సమయంలో.. కాంతార 1 సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తారక్ లుక్స్ షాక్‌కి గురిచేస్తున్నాయి.
తారక్ బాగా మజిల్ మాస్ కోల్పోయి ముఖం అంతా పీక్కుపోయినట్లు నీరసంగా కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న డ్రాగన్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసమే తారక్ లుక్‌ని మార్చుకుంటున్నారని కొందరు అంటున్నప్పటికీ.. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ యాడ్ షూటింగ్‌లో ఆయన గాయపడ్డారని.. ఆ గాయం నుంచి కోలుకుంటున్న సమయంలో వ్యాయామం చేయలేక ఇలా చిక్కిపోయి ఉంటారని మరికొందరు అంటున్నారు. ఏదేమైనప్పటికీ తారక్ సినిమాలో తన లుక్ కంటే ముందు ఆరోగ్యం చూసుకోవాలంటూ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.