Search The Query
Search

Image
  • Home
  • News
  • Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే

Jagan: నాడు కొమ్మినేని ఉద్యోగం పీకించింది బాబే

Jagan: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమ‌రావ‌తిని ఓ వేశ్య‌ల ప్రాంతం అని కృష్ణంరాజు అనే జ‌ర్న‌లిస్ట్ మాట్లాడిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపాయి. మాజీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాలో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్‌గా ప‌ని చేస్తున్న కొమ్మినేని శ్రీనివాసరావు ఏర్పాటుచేసిన డిబేట్‌లో కృష్ణంరాజు పాల్గొని నీచ‌పు వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో శ్రీనివాస‌రావును హైద‌రాబాద్‌లోని జ‌ర్న‌లిస్ట్ కాల‌నీ నుంచి ఆయ‌న్ను అరెస్ట్ చేసి విజ‌య‌వాడ‌కు త‌ర‌లించారు. ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ ఎక్స్ వేదిక‌గా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ అరాచకానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ప్రజాస్వామ్యం, చట్టం, న్యాయం ఖూనీ అయిపోతున్నాయి. ప్రజలు, ప్రజాస్వామ్యవాదుల్ని, మేధావుల్ని, జర్నలిస్టుల్ని భయకంపితుల్ని చేస్తున్నారు. ఏడాది కాలంగా చంద్ర‌బాబు నాయుడు చేస్తున్న అరాచకపు, అన్యాయ పాలనపై ప్రజల తరఫున వీరెవ్వరూ గొంతెత్తకుండా, ఏడాది తన దుర్మార్గపు పాలన, తన మోసాలు, తన అవినీతి, తన వైఫల్యాలపై స్వరం వినిపించకుండా చంద్రబాబుగారు తీవ్ర అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అణచివేయడానికి యత్నిస్తున్నారు. తాను చేయని వ్యాఖ్యలకు 70 ఏళ్ల వృద్ధుడైన, సీనియర్‌ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావుగారిని అరెస్టు చేసి కక్షసాధింపుల విష సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్లారు.

సహజంగా ఒక డిబేట్‌ జరిగేటప్పుడు, వక్తలు మాట్లాడే మాటలకు, యాంకర్‌కు ఏం సంబంధం? సహజంగానే ఓ డిబేట్‌లో వక్తలు కొందరు అనుకూలంగానూ, కొందరు వ్యతిరేకంగానూ మాట్లాడుతూ ఉంటారు. కొన్ని టీవీ ఛానళ్లలో వ్యక్తిత్వాలను హననం చేస్తూ చాలామంది గెస్ట్‌లు మాట్లాడిన సందర్భాలు గతంలో మనం చూడలేదా? ఇప్పటికీ కొనసాగడం లేదా?

ప్రజల తరఫున మీడియా నిలవకూడదని, చంద్రబాబుగారు చేసిన తప్పులను ప్రశ్నించకూడదని ఒక పథకం ప్రకారం లేని వాటిని ఆపాదిస్తూ, టాపిక్‌లను డైవర్ట్‌ చేస్తూ, వక్రీకరిస్తూ, సాక్షి మీడియాపైనా దాడులు చేయిస్తున్నారు. కొమ్మినేనిగారిపై చంద్రబాబు కక్ష కట్టడం ఇది తొలిసారికాదు. గతంలోనే ఆయన ఉద్యోగాన్ని ఊడగొట్టాడు. ఆయన నిష్ప‌క్షపాతంగా డిబేట్లు చేయడం తట్టుకోలేక 2014-19 మధ్య ఆ ఛానల్‌పై ( గతంలో, సాక్షి కాదు) ఆంక్షలు విధించారు. ఇప్పుడుకూడా తనకు మద్దతుగా లేవన్న కారణంతో ఆయా ఛానళ్లను నియంత్రిస్తూ కక్షసాధిస్తున్నారు. కొమ్మినేని గారి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను.

చంద్రబాబుగారూ.. ప్రజలు మీకు ఇచ్చిన అధికారం ఐదేళ్లే. అందులో ఏడాది గడిచిపోయింది. నాలుగేళ్ల తర్వాత మీరు చేసిన అన్యాయాలు, అక్రమాలు, అధికార దుర్వినియోగానికి ప్రజలకు తప్పకుండా సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చేసిన తప్పులకు బాధ్యత వహించాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చెడు సంప్రదాయాలకు నాందిపలుకుతూ ఇవాళ ఏది విత్తుతారో, రేపు అదే పండుతుంది, అది రెండింతలవుతుందని మర్చిపోకండి. అంటూ కూట‌మి ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.

More News

how tulsi plant warns you when you have Financial Issues
Financial Issues: తుల‌స‌మ్మ ఇచ్చే వార్నింగ్‌లు ఇవే
BySai KrishnaJun 21, 2025

Financial Issues: మన హిందూ సంప్ర‌దాయంలో తుల‌సి మొక్క‌కు ఉన్న విశిష్ట‌త గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఎంతో…

Rajinikanth watches and hugs manchu vishnu
Manchu Vishnu: ఈ హ‌గ్ కోసం 22 ఏళ్లు ఎదురుచూసా
BySai KrishnaJun 16, 2025

Manchu Vishnu: మంచు విష్ణు టైటిల్ పాత్ర‌లో న‌టించిన క‌న్న‌ప్ప సినిమా ఈ నెలాఖ‌రున రిలీజ్ కానుంది. ఈ సినిమాకు…

Heart Attack In Women
Heart Attack In Women: ఇది మ‌గ‌వారి స‌మ‌స్య కాదు
BySai KrishnaJun 15, 2025

Heart Attack In Women: గుండెనొప్పిని ఇప్పటికీ మెన్స్ డిసీజ్‌గా (Mens Disease) చూస్తున్నారు. అంటే కేవ‌లం మ‌గ‌వారికి మాత్ర‌మే…

Sunil Gavaskar says early RCB win could have prevented stampede
Sunil Gavaskar: RCB ముందే క‌ప్ గెలిచుంటే….
BySai KrishnaJun 9, 2025

Sunil Gavaskar: లెజండ‌రీ క్రికెట‌ర్ సునీల్ గ‌వాస్క‌ర్ చెప్పింది కూడా నిజ‌మే. కానీ ఏది ఎలా రాసుంటే అలా జ‌రుగుతుంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

JOIN US

Get Newsletter

Subscribe our newsletter to get the best stories into your inbox!


Scroll to Top