Breakfast Or Dinner ఏది మానేస్తే మంచిది?

Breakfast Or Dinner: బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్ ఇలా మూడు పూట‌లా తినేవారు ఉన్నారు. బ్రేక్‌ఫాస్ట్ మానేసి కేవ‌లం లంచ్ చేసే వాళ్లు.. లంచ్ మాత్ర‌మే తిని బ్రేక్‌ఫాస్ట్, డిన్న‌ర్ మానేసేవాళ్లూ లేకపోలేదు.  అయితే.. ఈ మూడింట్లో ఏది మానేస్తే బెట‌ర్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మ‌నం బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్‌ల‌లో ఏది మానేస్తే మంచిదో తెలుసుకుందాం. బ్రేక్‌ఫాస్ట్ అనేది ఉద‌యాన్నే తీసుకునే అల్పాహారం. కొంద‌రు ప్రొటీన్, ఫైబ‌ర్ ఎక్కువ‌గా ఉండే ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటూ ఉంటారు. దీని వ‌ల్ల ఆక‌లి త్వ‌ర‌గా వేయ‌దు. లంచ్ కూడా ఆల‌స్యంగా తిన్నా పెద్ద‌గా ఇబ్బంది లేదు. మ‌రికొంద‌రు బ్రేక్‌ఫాస్ట్ మానేసి కాఫీనో టీనో తాగేసి వెళ్లిపోతుంటారు.

నిజానికి బ్రేక్‌ఫాస్ట్ మాన‌కుండా ఉండ‌ట‌మే బెట‌ర్ అని జ‌ర్న‌ల్ ఆఫ్ క్లీనిక‌ల్ ఎండోక్రైనాల‌జీ అండ్ మెట‌బాలిజం స్ట‌డీస్‌లో వెల్ల‌డించారు. ఎందుకంటే దాదాపు 8 గంట‌ల పాటు క‌డుపు ఖాళీగా ఉన్న త‌ర్వాత ఉద‌యం లేచి మ‌నం అల్పాహారం తీసుకుంటాం. దీని వ‌ల్ల మెట‌బాలిజం బాగుంటుంది. శ‌క్తి వ‌స్తుంది. మైండ్ షార్ప్‌గా ప‌నిచేస్తుంది. అదే బ్రేక్‌ఫాస్ట్ మానేసి లంచ్ లేదా డిన్న‌ర్ చేసినా ఆక‌లి మీదుంటారు కాబ‌ట్టి ఏది ప‌డితే అది ఎలా ప‌డితే అలా తినేస్తుంటారు. దీని వ‌ల్ల కేలొరీలు ఎక్కువై బ‌రువు పెర‌గ‌డం త‌ప్ప శ‌రీరానికి ఉప‌యోగం ఏమీ ఉండ‌దు.

పైగా బ్రేక్‌ఫాస్ట్ మానేసే వారిలో గుండె జ‌బ్బులు ఎక్కువ‌గా ఉంటాయ‌ని కూడా స్ట‌డీస్‌లో పేర్కొన్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ చేసే వారిలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగ్గా ఉండి మెట‌బాలిజం కూడా బాగుంటుంద‌ట‌. డిన్న‌ర్ కూడా అంద‌రూ మానేయాల‌ని కాదు. గ‌ర్భిణులు, బాలింత‌లు, చిన్న‌పిల్ల‌ల‌కు ఇలాంటి నియ‌మాలు వ‌ర్తించ‌వు. ఇలాంటి వారు ఎప్పుడు ఏది తినాల‌న్నా వైద్యుల‌ను సంప్ర‌దించాల్సిందే. ఇంట‌ర్మిటెంట్ ఫాస్టింగ్ చేయాల‌నుకునేవారు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్న‌ర్‌లో ఏది మానేస్తే బెట‌ర్ అనేది కూడా వైద్యుల‌ను అడిగి అప్పుడు ఫాలో అయితే వెయిట్ లాస్ అవ్వ‌డం సులువ‌వుతుంది. దీంతో పాటు క‌చ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. వ్యాయామం చేయ‌లేని వారు క‌నీసం ఉద‌యం ఒక అర‌గంట‌… రాత్రి ఒక అర‌గంట వాకింగ్ చేసినా చాలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *