AC: ఏసీ, ఫ్యాన్ క‌లిపి వాడుతున్నారా?

AC: అస‌లే వేసవి కాలం. ఎండ‌లు ఠారెత్తిస్తున్నాయి. ఈ వేస‌వి కాలంలో మాత్ర‌మే క‌రెంట్ బిల్లు ఎంతొచ్చినా ఫ‌ర్వాలేదు.. ఏసీ మాత్రం ఉండాల్సిందే అనిపించ‌క మాన‌దు. అయితే.. ఏసీ వేసుకున్నా కూడా క‌రెంట్ బిల్లు ఎక్కువ‌గా రాకుండా ఉండాలంటే ఈ చిన్న చిట్కా పాటిస్తే స‌రిపోతుంద‌ట‌. ఇది చాలా మంది చేసేదే. కానీ ఇలా చేస్తే క‌లిగే బెనిఫిట్ మాత్రం చాలా మందికి తెలీక‌పోవ‌చ్చు.

అదేంటంటే.. చాలా మంది ఏసీతో పాటు ఫ్యాన్ కూడా వేసుకుంటూ ఉంటారు. రెండూ వేసుకుంటే క‌రెంట్ బిల్లు వాచిపోతుంది అనుకుంటారు కానీ నిజానికి కాస్త త‌గ్గుతుంది. ఎందుకంటే.. ఏసీ ఆన్‌లో ఉన్న‌ప్పుడు ఫ్యాన్ కూడా వేసుకుంటే ఏసీ త‌క్కువ యూనిట్ల‌ను తీసుకుంటుంది. ఇది మ‌న ఇంటి మీట‌ర్‌లోనూ తెలుస్తుంది. ఏసీ 26లో పెట్టుకుని ఫ్యాన్ వేసుకుంటే అది 22లో ఉన్నంత చ‌ల్ల‌ద‌నాన్ని ఇస్తుంది. కావాలంటే ప్ర‌య‌త్నించి చూడండి.

ఏసీ వేసుకున్న‌ప్పుడు 1.4 యూనిట్లు కాలితే.. ఏసీ, ఫ్యాన్ క‌లిపి వేసుకుంటే కాలేది కేవ‌లం 1 యూనిటే. ఏసీతో పాటు ఫ్యాన్ వేసుకుంటే ఏసీ కంప్రెస‌ర్‌ను ఎక్కువ‌గా వాడ‌దు. త‌క్కువ కంప్రెసర్ వాడ‌కం ఉంటే ఓవ‌ర్ హీటింగ్, గ్యాస్ లీక్ వంటి స‌మ‌స్య‌లు కూడా ఉండ‌వు. దీని వ‌ల్ల ఏసీ కూడా ఎక్కువ కాలం మ‌న్నుతుంది. 2023లో లాన్సెట్ ప్లానెట‌రీ హెల్త్ అనే సంస్థ చేసిన ప‌రిశోధ‌న‌లో ఏసీ, ఫ్యాన్ క‌లిపి వేసుకుంటే కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు త‌క్కువ అవుతాయని తేలింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *