IPL 2025: పంత్.. ధోనీతో మాట్లాడు

IPL 2025: మాజీ క్రికెట‌ర్ వీరేందర్ సెహ్వాగ్.. ఫాం కోల్పోయి బాధ‌ప‌డుతున్న రిష‌భ్ పంత్‌కు ఓ స‌ల‌హా ఇచ్చారు. 10 ఇన్నింగ్స్‌లో కేవ‌లం 128 ప‌రుగులు చేసిన పంత్ త‌న ఆట‌తీరు ప‌ట్ల బాధ‌ప‌డుతున్నాడు. ఎందుకిలా ఆడుతున్నాను అంటూ డిప్రెష‌న్‌లోకి వెళ్లిపోతున్నాడ‌ట‌. ఇది గ‌మనించిన సెహ్వాగ్ పంత్‌ను పిలిపించి మాట్లాడారు. నీకు న‌చ్చిన, అనుభ‌వం ఉన్న వ్య‌క్తితో సంభాషించు పంత్. కావాలంటే నీ గ‌త పెర్ఫామెన్స్‌లు చూస్కో. నీకు ఎంతో ఇష్ట‌మైన నీ రోల్ మోడ‌ల్ ధోనీని క‌లిసి ఓసారి మాట్లాడి చూడు అని స‌ల‌హా ఇచ్చారు.

ఈ ఏడాది ల‌ఖ్‌నౌ సూప‌ర్ జైంట్స్ (LSG) పంత్‌ను రూ. 27 కోట్ల‌కు కొనుగోలు చేసింది. ఇది అత్యంత ఖ‌రీదైన కొనుగోలనే చెప్పాలి. కానీ పంత్ మాత్రం తీసుకున్న డ‌బ్బుకు న్యాయం చేయ‌డం లేదు. సూపర్ జైంట్స్ య‌జ‌మాని సంజీవ్ గోయెంకా నోటికొచ్చిన‌ట్లు మాట్లాడుతున్నాడు.

గ‌తేడాది కూడా సంజీవ్.. అప్ప‌టి కెప్టెన్ కేఎల్ రాహుల్‌ను అంద‌రి ముందు ధూషించాడు. ఇప్పుడు పంత్‌కి కూడా మొట్టికాయ‌లు ప‌డుతున్నాయ్. దాంతో పాపం తెగ బాధ‌ప‌డిపోతున్నాడు. ఈ నేప‌థ్యంలో సెహ్వాగ్ పంత్‌ను పిలిచి ఓసారి ధోనీతో మాట్లాడు అని స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం ల‌ఖ్‌నౌ పాయింట్స్ టేబుల్‌లో ఏడో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కి వెళ్లాలంటే మిగిలిన మూడు మ్యాచ్‌ల‌లో గెలిచి తీరాల్సిందే. మ‌రి పంత్ ఎలాంటి స్ట్రాట‌జీని వాడ‌తాడో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *