GT vs RR: వైభ‌వ్ మెరుపులు.. గిల్ కుళ్లు వ్యాఖ్య‌లు

GT vs RR: వైభ‌వ్ సూర్య‌వంశీ.. ఇప్పుడు ఈ 17 ఏళ్ల పిడుగే టాక్ ఆఫ్ ది నేష‌న్‌. ఏ క్రికెట్ అభిమాని నోట విన్నా వైభ‌వ్ పేరు మారుమోగిపోతోంది. ఏమా ఆట‌.. ఏమా బాదుడు.. అబ్బ‌బ్బా ఎన్ని సార్లు ఆ సెంచ‌రీ గుర్తుచేసుకున్నా త‌నివి తీర‌డం లేదు. నిన్న గుజ‌రాత్ టైటాన్స్‌కి రాజ‌స్థాన్ రాయ‌ల్స్‌కు మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో వైభ‌వ్ ఆట‌తీరును చూసి గుజ‌రాత్ టైటాన్స్ ఫ్యాన్స్ కూడా మెచ్చుకోకుండా ఉండ‌లేక‌పోయారు. కానీ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ మాత్రం కాస్త కుళ్లుకున్న‌ట్లు అనిపిస్తోంది.

ఇందుకు కార‌ణం అత‌ను వైభ‌వ్ ప‌ట్ల చేసిన వ్యాఖ్య‌లే. మ్యాచ్ అయిపోయాక గిల్ మీడియాతో మాట్లాడుతూ.. వైభ‌వ్‌కి ఈరోజు బాగా క‌లిసొచ్చింది. నిజంగానే అత‌ను ల‌క్కీ అన్నాడు. ఈ వ్యాఖ్య‌లు విన్న సీనియ‌ర్ మాజీ క్రికెట‌ర్ అజ‌య్ జ‌డేజా గిల్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు. ల‌క్కీనా? ఏం మాట్లాడుతున్నావ్ గిల్? ఆ పిల్లాడు అంత క‌ష్ట‌ప‌డి త‌న స‌త్తా ఏంటో నిరూపించుకున్నాడు. ఆ స‌త్తాను నువ్వు ల‌క్ అంటున్నావంటే అది మ‌ర్యాద అనిపించుకోదు అని గ‌డ్డిపెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *