Samantha: రెండో పెళ్లి నిజ‌మేనా? అత‌నితో తిరుమ‌ల‌కు సామ్

Samantha: స‌మంత సినిమాల కంటే ఆమె వ్య‌క్తిగ‌త విష‌యాల‌కు సంబంధించే ఎక్కువ పుకార్లు వ‌స్తుంటాయి. అఫ్‌కోర్స్ జ‌నాల‌కు అవే ఇంట్రెస్ట్ అనుకోండి. ఇటీవ‌ల నాగ‌చైత‌న్య న‌టి శోభిత ధూలిపాళ్ల‌ను పెళ్లి చేసుకుని ఓ ర‌కంగా అంద‌రికీ షాక్ ఇచ్చార‌నే చెప్పాలి. ఇప్పుడు వారిద్దరూ సంతోషంగా జీవిస్తున్నారు. ఇక స‌మంత గురించి చెప్పాలంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకోదేమో.. చేసుకున్నా ఇప్పుడ‌ప్పుడే కాదేమో అని ఎవ‌రి అభిప్రాయాలు వారికి ఉన్నాయి.

అయితే.. స‌మంత ద‌ర్శ‌కుడు రాజ్ నిడ‌మోరుతో డేటింగ్‌లో ఉన్నార‌ని కొంత‌కాలంగా వార్త‌లు వ‌స్తున్నాయి. స‌మంత న‌టించిన ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ – హ‌నీ బ‌న్నీ సిరీస్‌ల‌కు రాజ్ ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. ఫ్యామిలీ మ్యాన్ 2 స‌మ‌యంలోనే రాజ్, స‌మంత‌కు మ‌ధ్య ప‌రిచ‌యం ఏర్ప‌డి అది కాస్తా ప్రేమ‌గా మారింద‌నే టాక్ కూడా ఉంది. ఓసారి.. ఇలాగే స‌మంత‌, రాజ్ ప్రేమించుకుంటున్నారు అనే రూమ‌ర్స్ వ‌స్తుండ‌డంతో.. స‌మంత త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మిడిల్ ఫింగ‌ర్ చూపిస్తూ ఫోటో పోస్ట్ చేసారు. అంటే.. అలాంటి రూమ‌ర్స్ సృష్టించే వారికి తానిచ్చే స‌మాధానం ఇదే అని చెప్పారు. కానీ ఇప్పుడు క‌నిపిస్తున్న దృశ్యాలు చూస్తుంటే రాజ్, స‌మంత త్వ‌ర‌లో పెళ్లి చేసుకుంటారు అనే టాక్ ఇంకాస్త బ‌లంగా వినిపిస్తోంది.

ఎందుకంటే.. నిన్న స‌మంత‌, రాజ్ క‌లిసి తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నానికి వెళ్లారు. ఆ స‌మ‌యంలో స‌మంత ప‌క్క‌న రాజ్ కూడా ఉండ‌డంతో ఇక వ‌దంతుల‌కు మ‌రింత ఆజ్యం పోసిన‌ట్ల‌య్యింది. పోనీ స‌మంత‌, రాజ్ మంచి స్నేహితులు.. అందుకే తిరుమ‌ల‌కు క‌లిసే వెళ్లారు అనుకుందామా అంటే.. రాజ్ ఒక్క‌రే ఎందుకు వెళ్తారు? ఆయ‌న త‌న భార్య శ్యామిలీని కూడా తీసుకెళ్లేవారు క‌దా..! స‌మంత శుభం అనే సినిమాకు నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ సినిమా మేలో రిలీజ్ అవ్వ‌నుంది. పోనీ ఈ సినిమాకు రాజ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మో.. లేదా ప్రొడ్యూస్ చేయ‌డ‌మో వంటివి చేస్తే క‌లిసి తిరుమ‌ల‌కు వెళ్లారు అనుకునే ఛాన్స్ ఉంటుంది. అవేమీ లేకుండా రాజ్ స‌మంత‌తో క‌లిసి తిరుమ‌ల‌కు ఎందుకు వెళ్లారు? అనే అంశం ఇప్పుడు నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *