Sikandar: ర‌ష్మిక‌కు థియేట‌ర్ ఓన‌ర్ మ‌ద్దతు

Sikandar: బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ స‌ల్మాన్ ఖాన్‌తో క‌లిసి న‌టించే ఛాన్స్ కొట్టేసింది ర‌ష్మిక మంద‌న‌. వీరిద్ద‌రూ జంట‌గా సికంద‌ర్ అనే సినిమాలో న‌టించారు. మొన్న రంజాన్‌కు రిలీజ్ అయిన ఈ సినిమా అట్ట‌ర్ ఫ్లాప్ అయ్యింద‌నే చెప్పాలి. అస‌లు సినిమాలో కంటెంటే లేద‌ని పైగా 35 ఏళ్ల వ్య‌త్యాసం ఉన్న అమ్మాయిని హీరోయిన్‌గా ఎలా పెడ‌తార‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. ఇదిలా ఉండ‌గా.. ముంబైలో ఫేమ‌స్ థియేట‌ర్ల‌లో ఒక‌టైన గైటీ గెలాక్సీ య‌జ‌మాని మ‌నోజ్ దేశాయ్ ర‌ష్మిక మంద‌న‌ను సపోర్ట్ చేస్తూ కామెంట్స్ చేయ‌డం వైర‌ల్‌గా మారింది. సినిమాలో ర‌ష్మిక పాత్ర‌కు సంబంధించిన నిడివి ఎక్కువ‌గానే ఉంద‌ట‌.

కానీ సినిమా థియేట‌ర్‌కు వ‌చ్చేస‌రికి ర‌ష్మిక పాత్ర‌ను చాలా మ‌టుకు క‌ట్ చేసేసార‌ట‌. ఈ విషయాన్ని మ‌నోజ్ మీడియా ద్వారా వెల్ల‌డిస్తూ స‌ల్మాన్ ఖాన్‌పై సినిమా తీసిన వారిపై మండిప‌డ్డారు. అస‌లు ఏఆర్ మురుగ‌దాస్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారంటే న‌మ్మ‌బుద్ధి కావ‌డం లేద‌ని అంటున్నారు. అస‌లు రష్మిక పాత్ర‌ను క‌ట్ చేయాల‌న్న‌ప్పుడు ఆమెను సినిమాలో ఎందుకు తీసుకున్న‌ట్లు అని ప్ర‌శ్నించారు. ఈ సినిమా రిలీజ్ అయిన రోజు సాధార‌ణంగా వ‌చ్చే ఆడియ‌న్స్ కూడా రాక‌పోవ‌డంతో నిర్మాత సాజిద్ న‌దియాద్‌వాలా త‌న‌కు ఫోన్ చేసి ముందు ముందు జ‌నాలు వ‌స్తార‌ని.. డ‌బ్బులు వ‌స్తాయ‌ని బుజ్జ‌గించిన‌ట్లు మ‌నోజ్ తెలిపారు. ఒక‌ప్పుడు త‌న థియేట‌ర్‌లో స‌ల్మాన్ సినిమా రిలీజ్ అయితే విజిల్స్‌తో మారుమోగిపోయేద‌ని.. ఇప్పుడు విజిల్స్ సంగ‌తి ప‌క్క‌న పెడితే జ‌నాలు కూడా రావ‌డంలేద‌ని ఆయ‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *