Urvashi Rautela About Chiranjeevi: తన తల్లి ఈరోజు ఆరోగ్యంగా ఉన్నారంటే అందుకు మెగాస్టార్ చిరంజీవే కారణమని అన్నారు నటి ఊర్వశి రౌతెల. తన తల్లికి కాలు బాగోలేదని హాస్పిటల్లో చేర్పించామని.. ఏదో పెద్ద సమస్య ఉందని వైద్యులు చెప్పారని అన్నారు. తాను వెంటనే చిరంజీవికి కాల్ చేసానని ఆయన వెంటనే కలకత్తా అపోలోకి కాల్ చేసి బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పించారని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్తో వెంటనే సాయం చేసిన ఆయనకు తాము ఎప్పటికీ రుణపడి ఉంటామని తెలిపారు. నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన లేటెస్ట్ సినిమా డాకు మహారాజ్లో (Daaku Maharaj) ఊర్వశి కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే.