Manu Bhaker: ఒలింపిక్ విజేత మనూ భాక‌ర్ ఇంట్లో తీవ్ర విషాదం

Manu Bhaker:  భార‌త్‌కు చెందిన ఒలింపిక్ షూటింగ్ స్టార్ మ‌నూ భాక‌ర్ ఇంట్లో త‌వ్ర విషాదం చోటుచేసుకుంది. మ‌నూ అమ్మ‌మ్మ‌, మామ‌య్య రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందారు. ఇద్ద‌రూ ఒకేసారి రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోవ‌డంతో మ‌నూ ఇంట్లో విషాద‌ఛాయ‌లు అలుకుముకున్నాయి. హరియాణాలోని మ‌హేంద్ర‌గ‌ఢ్ బైపాస్ రోడ్డులో ఈ ప్ర‌మాదం చోటుచేసుకుంది. ఆ స‌మ‌యంలో మ‌నూ అమ్మ‌మ్మ, మామ‌మ్మ‌లు క‌లిసి స్కూటీపై వెళ్తుండ‌గా.. బైపాస్ రోడ్డు ద‌గ్గ‌ర ఓ కారు వారి స్కూటీని ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రూ అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.  దాంతో కారు డ్రైవర్ అక్క‌డి నుంచి ప‌రార‌య్యాడు. ఒలింపిక్స్‌లో రెండు ప‌త‌కాలు సాధించిన మ‌నూ ఇటీవ‌ల రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము చేతుల మీదుగా మేజ‌ర్ ధ్యాన్‌చంద్ ఖేల్ ర‌త్న అవార్డును అందుకున్నారు. ఒలింపిక్స్‌లో షూట‌ర్‌గా మెడ‌ల్ సాధించిన ఏకైక భార‌తీయ మ‌హిళ మ‌నూ భాక‌ర్. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *