Thandel Movie: నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమాపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కావాలనే దుష్ప్రచారం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2018లో శ్రీకాకుళానికి చెందిన కొందరు మత్య్సకారులను తీరం దాటి వచ్చారన్న ఆరోపణలపై పాకిస్థాన్ నౌకాదళ అధికారులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వారిని దాదాపు ఏడాది పాటు పాక్ జైల్లో పెట్టారు. ఈ పాయింట్‌ను ప్రధానంగా చేసుకుని దానికి అందమైన ప్రేమ కథను అల్లి సినిమాగా తీసారు చందూ మొండేటి.
మొన్న శుక్రవారం సినిమా రిలీజ్ అయ్యింది. మంచి టాక్ అందుకుంది. మంచి వసూళ్లు కూడా రాబడుతోంది. అయితే.. 2019లో పాక్ జైల్లో చిక్కుకున్న మత్య్సకారులను బయటికి సురక్షితంగా తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదని.. అప్పటికే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు అంటూ ఓ వ్యక్తి సాక్షి చానెల్‌తో మాట్లాడటం వైరల్‌గా మారింది. అసలు తండేల్ సినిమాలో చూపించిన కథ వేరు.. నిజ జీవితంలో మత్య్సకారుల పట్ల జరిగింది వేరు అంటూ ఆ వ్యక్తి ఆరోపణలు చేస్తున్నాడు. ఆ సమయంలో మత్య్సకారులు పడిన ఇబ్బందుల గురించి సినిమాలో చూపించకుండా.. ప్రేమ కథను ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నాడు.
Thandel Movie: ఈ వ్యాఖ్యలు చేస్తోంది కూడా ఎవరో కాదు.. పాక్ జైలుకి వెళ్లి తిరిగొచ్చిన మత్య్సకారుల్లో ఒకరు. అలా అని ఆయనకు ఆయనే మీడియా ముందు చెప్పుకుంటున్నాడు. ఆ మత్య్సకారుల్లో ఆయన ఉన్నాడో లేడో కూడా ఎవ్వరికీ క్లియర్‌గా తెలీదు. తమను సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది మాత్రం జగన్ మోహన్ రెడ్డే అని.. అందుకు ఆయనకు జీవితాంతం రుణ పడి ఉంటామని తెలిపాడు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీసై నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. మత్య్సకారులు పాక్ జైల్లో ఉన్నారని తెలిసి వెంటనే అప్పటి విదేశాంగ శాఖ మంత్రి, దివంగత సుష్మా స్వరాజ్‌ను కలిసింది తెలుగు దేశం పార్టీ నేత అయిన రామ్మోహన్ నాయుడే అని.. ఆయన సుష్మా స్వరాజ్‌ను నేరుగా కలిసి వినతి పత్రం అందించారంటూ అప్పట్లో రామ్మోహన్ చేసిన ట్వీట్‌ను కూడా నెటిజన్లు షేర్ చేస్తున్నారు.
తండేల్ సినిమా రిలీజ్‌కి ముందే దర్శకుడు చందూ మొండేటి.. ఇది నిజ జీవిత కథ నేపథ్యంలో తీసిన సినిమానే అయినప్పటికీ లవ్ స్టోరీని ముడిపెట్టి కాస్త సినిమాటిక్‌గా తీసామని చెప్పారు. కానీ వైసీపీ మద్దతుదారులు మాత్రం ఉన్నది ఉన్నట్లు తీయకుండా.. ఎక్కడా కూడా జగన్ మోహన్ రెడ్డి చేసిన కృషిని చూపించకుండా కల్పిత కథలా ఎలా తీస్తారంటూ దుమ్మెత్తిపోస్తున్నారు.