YS Jagan: రాజకీయాల్లో అధికార పార్టీలు ప్రతిపక్ష, విపక్ష పార్టీలు ఎలా తన్నులాడుకుంటాయో మన భారతీయులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మన దేశంలోని రాజకీయాలు చూస్తే అసలు సాధారణ వ్యక్తులకు రాజకీయాల్లోకి అడుగుపెట్టాలంటేనే వణుకుపుడుతుంది. ఆ రేంజ్‌లో ఉంటాయి. ఇక మన తెలుగు రాష్ట్రాల రాజకీయాల గురించి ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిది. పాజిటివిటీ కన్నా నెగిటివ్ అంశాలే ఎక్కువగా ఉంటాయి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలకు ట్రోలర్స్‌కు మీమ్స్ వేసుకునేందుకు బాగా పనికొస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే.. ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్‌కు తెలుగు దేశం పార్టీతో ఉన్న శత్రుత్వం పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనేంత రేంజ్‌లో ఉంది. కూటమిలో ఉన్న జనసేన, భారతీయ జనతా పార్టీలకు వైఎస్సార్ కాంగ్రెస్‌కు మధ్య పెద్దగా పడకపోవడాలు అంటూ ఏమీ లేదు. ఇక్కడ వైరం కేవలం జగన్ మోహన్ రెడ్డి.. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కి మధ్య మాత్రమే. జగన్‌ను అధికారంలో లేకుండా చేయాలని చంద్రబాబు నాయుడు జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తులు పెట్టుకుని మరీ గెలిచారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. (YS Jagan)
జగన్ కూడా తన పోరాటం చంద్రబాబు నాయుడు మీద కాదని.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా వర్గాలతో మాత్రమే అని ఇప్పటికే పలు మార్లు చెప్పారు. అయితే పోరాటం అనేది కేవలం మాటల్లోనే కాదు. చేతల్లోనూ ఉండాలి. అప్పుడే నిజమైన నాయకుడు అనిపించుకుంటాం. జగన్ పోరాటం తెలుగు దేశం పార్టీ కోసమే పనిచేసే మీడియా వర్గాలపై అయినప్పుడు.. తనకున్న సాక్షి పత్రిక, వెబ్‌సైట్‌లో కూటమి ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తుంటారు. ఇది ఎక్కడైనా జరిగేదే. ఒక పార్టీకి సపోర్ట్ చేసే మీడియా వర్గాలు ఆ పార్టీకి సంబంధించిన పాజిటివ్ వార్తలు.. నచ్చని పార్టీకి సంబంధించి నెగిటివ్ ప్రచారాలు చేస్తుంటాయి.
అయితే.. సాక్షికి.. తెలుగు దేశం పార్టీకి మద్దతు పలికే మీడియాకి చాలా తేడా ఉంది. అదేంటంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 మీడియా వాళ్లు ఎప్పుడూ కూడా డబ్బులకు ఆశపడి దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి కానీ.. జగన్ గురించి కానీ ఎప్పుడూ ప్రకటనలు వేసింది లేదు. కానీ సాక్షి అలా కాదు. ఈరోజు దివంగత నేత ఎన్టీరామారావు 29వ వర్ధంతి సందర్భంగా సాక్షి.. ఫ్రంట్ పేజీలో పెద్ద యాడ్ వేసింది. ఆ యాడ్ మొత్తం పసుపుమయమే. చంద్రబాబు నాయుడు, ఎన్టీరామారావు, నారా లోకేష్‌ల ఫోటోలు కూడా ఉన్నాయి. సాక్షి పేపర్ నిత్యం చదివేవారు కూడా ఈరోజు పేపర్ చూసి కంగుతిని ఉంటారు. (YS Jagan)
ఈ ప్రకటన కోసం ఎన్టీరామారావు, తెలుగు దేశం పార్టీ అభిమానులో లేక కుటుంబ సభ్యులో ఎవరో సాక్షికి ఫ్రంట్ పేజీలో ప్రకటన వేసేలా భారీ మొత్తంలో డబ్బులు చెల్లించారు. అందుకే సాక్షి ఫ్రంట్ పేజీపై ఈ యాడ్ వేయించారని అంటున్నారు. కానీ.. ఇలా ఎంత డబ్బులు ఇచ్చినా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వాళ్లు మాత్రం జగన్ గురించి కానీ జగన్ కుటుంబానికి సంబంధించిన వారి ఫోటోలు కానీ పాజిటివ్‌గా ఉండేలా యాడ్లు మాత్రం చచ్చినా వేయరు. సాక్షి కూడా అంతే కఠినంగా, ఆత్మాభిమానంతో ఉండి ఉంటే ఓ గౌరవం ఉండేది. బయటేమో తన పోరాటం తెలుగు దేశం పార్టీ తరఫున పనిచేసే పచ్చ పత్రికలపై అని డైలాగులు చెప్తూ.. వ్యాపారం దగ్గరికి వచ్చే సరికి తెలుగు దేశం పార్టీని పొడుగుతూ యాడ్ వేయడంపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఇది జగనన్న యాపారం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.